మీటూ కేసులో తనుశ్రీకి షాక్

మీటూ కేసులో తనుశ్రీకి షాక్

ముంబై: మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్‌‌‌‌ నటుడు నానాపాటేకర్‌‌‌‌కు ఆ కేసు నుంచి ఊరట లభించింది. తనుశ్రీ దత్తను ఆయన లైంగికంగా వేధించారనే ఆరోపణల్లో ఎటువంటి ఆధారాలు లేవని పోలీసులు లోకల్‌‌‌‌ కోర్టులో చెప్పారు. దీంతో కోర్టు ఆయనకు క్లీన్‌‌‌‌చిట్‌‌‌‌ ఇచ్చింది. ఈ తీర్పుపై తనుశ్రీ దత్త తరఫు లాయర్‌‌‌‌‌‌‌‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసు విచారణలో పోలీసులు నిర్లక్ష్యం వహించారని, నిందితుడిని కాపాడేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారన్నారు. లోకల్‌‌‌‌ కోర్టు తీర్పుపై బాంబే హైకోర్టుకు వెళ్తామని చెప్పారు. నానాపాటేకర్‌‌‌‌‌‌‌‌కు క్లీన్‌‌‌‌చిట్‌‌‌‌ ఇవ్వడంపై తనుశ్రీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసులు, న్యాయవ్యవస్థ అన్నీ అవినీతి మయమైపోయాయని, సాక్ష్యాలను మాయం చేశారని ఆమె ఆరోపించారు. ‘హార్న్‌‌‌‌ ఓకే ప్లీజ్‌‌‌‌’ సినిమా షూటింగ్‌‌‌‌ సమయంలో నానాపాటేకర్‌‌‌‌‌‌‌‌ లైంగికంగా వేధించారని తనుశ్రీ దత్త ఆరోపించారు. అయితే ఆ కామెంట్స్‌‌‌‌ను నానాపాటేకర్‌‌‌‌‌‌‌‌ అప్పట్లో ఖండించారు.