రేపు నేను ఉంటానో లేదో.. మరణం గురించి ముందే చెప్పిన నానా పటేకర్..!

రేపు నేను ఉంటానో లేదో.. మరణం గురించి ముందే చెప్పిన నానా పటేకర్..!

న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్​నటుడు నానా పటేకర్ (75) కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. బుధవారం రాత్రి ఆయన అపస్మారక స్థితిలో కనిపించడంతో కుటుంబ సభ్యులు ట్రీట్​మెంట్​కోసం దొనా పౌలాలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. గురువారం ఉదయం 5:20 గంటలకు ఆయన మరణించినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు. 

నానా పటేకర్​ అసలు పేరు విశ్వనాథ్ పటేకర్. జనవరి 1, 1951న మహారాష్ట్రలోని మురుడ్-జంజీరాలో దినకర్ పటేకర్, నిర్మలా పటేకర్ దంపతులకు జన్మించారు. 1978లో మరాఠీ నటి, ప్రొడ్యూసర్ ​నీలకంఠిని ఆయన పెండ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి వారు విడిపోయారు. విడాకులు తీసుకోకుండానే విడివిడిగా ఉంటున్నారు. వారికి ఇద్దరు కొడుకులు. అయితే, ఓ కొడుకు పుట్టిన రెండేండ్లకే అనారోగ్యంతో చనిపోయాడు. రెండో కొడుకు మల్హర్​ అసిస్టెంట్ ​డైరెక్టర్​గా పనిచేస్తున్నారు. 

1978లో గమన్ సినిమాతో బాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి..

నానా పటేకర్​1978లో సినిమాల్లోకి వచ్చారు. గమన్ సినిమాతో ఆయన బాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అడుగుపెట్టారు. హిందీతో పాటు మరాఠీ సినిమాల్లో వైవిధ్యబరితమైన పాత్రల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. క్రాంతి వీర్​సినిమాకు ఉత్తమ నటుడిగా, పరిందా, అగ్నిసాక్షి సినిమాలకు ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డులు దక్కించుకున్నారు. 

నట సామ్రాట్, వజూద్, పరిందా, అబ్ తక్ ఛప్పన్, యశ్వంత్ వంటి చిత్రాలు అతనకి ఎంతో గుర్తింపు తెచ్చాయి. 2013లో పద్మశ్రీ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం ఆయనను గౌరవించింది. అదే సంవత్సరం మహారాష్ట్ర ప్రభుత్వం ‘రాజ్​కపూర్ స్పెషల్​కాంట్రిబూషన్’ అవార్డ్​ ప్రదానం చేసింది. 

కాగా, నానా పటేకర్ ఓ రోమియో, సుబేదార్ చిత్రాల్లో చివరి సారిగా నటించారు. ఆయన నటించిన కొన్ని సినిమాలు ఇంకా నిర్మాణానంతర, రిలీజ్​దశల్లో ఉన్నట్టు తెలిసింది. అలాగే, నానా పటేకర్ చివరిసారిగా నాలుగు రోజుల క్రితం గోవాలోని డోనా పౌలాలో ‘సామ్రాట్ క్లబ్ ఇంటర్నేషనల్’ పదవీ స్వీకార కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు.

రేపు నేను ఉంటానో లేదో..

నానా పటేకర్ ఇటీవల ఓ కార్యక్రమంలో మరణం గురించి మాట్లాడుతూ.. ‘రేపు నేను ఉంటానో లేదో తెలియదు’ అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్​అవుతున్నాయి. ఈ నెల 4న గోవాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘మనందరం ఏదో ఒక రోజు వెళ్లిపోవాల్సిందే. రేపు నేను ఇక్కడ ఉంటానో లేదో నాకు తెలియదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆ టైమ్ వస్తుంది. 

కానీ, ఆరోజు రాకముందే మనం కొన్ని ఆలోచించుకోవాలి. నేను చేయాలనుకున్నది చేయగలిగానా..? నా లక్ష్యం దిశగా ప్రయత్నించానా..? అనేది ఎప్పుడూ పరిశీలించుకోవాలి. జీవితమంతా సాధించాలనే తపనతో ఉండాలి’ అని  అన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన మూడు రోజులకే ఆయన మృత్యు ఒడికి చేరారు. పుణె శివారులో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి.

100కు పైగా రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం

నానా పటేకర్ సినీ రంగంలో కోట్లు సంపాదించినా నిరాడంబరమైన జీవితాన్నే గడిపారు. ఏండ్ల పాటు సింగిల్​బెడ్​రూం ఇంట్లోనే ఉన్నారు. సినీ కళాకారుల కోసం ప్రభుత్వం కట్టించి ఇచ్చిన ఇంట్లో కూడా ఉన్నారు. 30 ఏండ్ల పాటు ఆటోలోనే సినిమా షూటింగ్​లకు వెళ్లారు. ఓ సమయంలో అప్పుల బాధతో రైతుల ఆత్మహత్య అనే వార్త విని చలించిపోయారు. బాధిత కుటుంబాలను స్వయంగా తానే కలిసి, రూ.15 వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు.  

పటేకర్ మృతి పట్ల ప్రముఖుల సంతాపం

నానా పటేకర్ మృతి పట్ల ప్రధాని మోదీ, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్​తోపాటు కేంద్ర మంత్రులు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం తీరని లోటును మిగిల్చిందని మోదీ పేర్కొన్నారు. ‘ నానా పటేకర్ కు ఉన్న అద్భుతమైన వ్యక్తిత్వం చాలా తక్కువ మంది నటులకు ఉంటుంది. ఆయన తరతరాలూ గుర్తుండిపోయే పాత్రలను అందించారు.

తన అభిప్రాయాలను నిర్భయంగా చెప్పడంలో వెనుకాడని ఆయన నిజాయితీని కూడా అందరూ అభిమానించేవారు’ అని మోదీ ఎక్స్​వేదికగా పేర్కొన్నారు. భారతీయ చలనచిత్ర రంగంలోని అత్యుత్తమ నటులలో నానా పటేకర్ ​ఒకరని గోవా సీఎం ప్రమోద్ సావంత్ అన్నారు. తనకు సన్నిహిత మిత్రుడని, అంకితభావం గల సామాజిక కార్యకర్త అని గుర్తుచేసుకున్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి అండగా ఉంటానని పేర్కొన్నారు.  

అంత్యక్రియల కోసం ముందే కట్టెలు

నానా పటేకర్​తన అంత్యక్రియల కోసం ముందే కట్టెలు దాచినట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఏదో ఒకరోజు తాను ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోతానని, తన అంత్యక్రియల కోసం 12 మణుగుల కట్టెలు దాచానని చెప్పారు. అవే తన చివరి ఆస్తి అని ఆయన పేర్కొన్నారు. ఆ కట్టెలతోనే తన అంత్యక్రియలు నిర్వహించాలని.. దహనం చేసే ముందు వాటిని ఎండబెట్టాలని.. ఎందుకంటే తడిచినవి ఉపయోగిస్తే పొగ వల్ల తన అంత్యక్రియలకు వచ్చిన స్నేహితులకు కన్నీళ్లు వస్తాయని చెప్పినట్టు ఆయన ఇంటర్వ్యూలో వెల్లడించారు.