Akhanda 2: అఖండ 2 ఓటీటీ హక్కులకు రికార్డు ధర.. టైంకి రాకపోతే కండీషన్కు కట్టుబడి ఉంటారా!

Akhanda 2: అఖండ 2 ఓటీటీ హక్కులకు రికార్డు ధర.. టైంకి రాకపోతే కండీషన్కు కట్టుబడి ఉంటారా!

బాలకృష్ణ, బోయపాటి కాంబో అంటే.. మాస్ ఫ్యాన్స్కు పూనకాలే. సింహ, లెజెండ్, అఖండ వంటి సినిమాలతో బాలకృష్ణ ఫ్యాన్స్కు మంచి విందునిచ్చాడు బోయపాటి. ఇక ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత ‘అఖండ’కు సీక్వెల్‌‌గా ‘అఖండ2’తో ఈ కాంబో మళ్ళీ వస్తోంది. తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.

ఇప్పటికే మూవీ కాన్సెప్ట్ వీడియో, టీజర్ రిలీజ్ చేసి భారీ అంచనాలు పెంచారు బోయపాటి. ఇపుడు ఈ అంచనాలకు తగ్గట్టుగానే ‘అఖండ2’ ఓటీటీ డీల్ భారీ ధరకు అమ్ముడయినట్లు సినీ వర్గాల సమాచారం.

అఖండ 2 డిజిటల్ హక్కుల కోసం ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ పోటీ పడినట్లు టాక్. అందులో నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 వంటి దిగ్గజ ప్లాట్ఫామ్స్ ఉన్నాయని సమాచారం. అయితే, వీటన్నిటినీ వెనక్కినెట్టి అఖండ 2 ఓటీటీ హక్కులను జియోహాట్‌స్టార్‌ దక్కించుకుందనే వివరాలు బయటకొచ్చాయి. అందుకు ఏకంగా రూ.85 కోట్లకు డీల్ చేసుకున్నట్లు ట్రేడ్ నివేదికలు చెబుతున్నాయి.

ఈ భారీ మొత్తాన్ని చెల్లించడానికి దిగ్గజ ప్లాట్ఫామ్స్ ఆలోచించినప్పటికీ, హాట్‌స్టార్‌ మరో ఆలోచన లేకుండా హక్కులు సొంతం చేసుకుందట. గత సినిమాలతో పోలిస్తే, బాలకృష్ణ కెరియర్లోనే ఇది హయ్యెస్ట్ అమౌంట్. అయితే, ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది.

‘అఖండ2’ హక్కులను సొంతం చేసుకున్న జియోహాట్‌స్టార్‌ నిర్మాతలకు ఓ కండీషన్ పెట్టిందట. మేకర్స్ మొదట అనుకున్న డేట్ ప్రకారం.. అఖండ 2 సెప్టెంబర్ 25న విడుదల అవ్వాల్సింది. కానీ, ఇటీవల సమ్మెతో ఓ స్పెషల్ సాంగ్తో పాటు ఓ భారీ షెడ్యూల్ బ్యాలెన్స్ ఉండిపోయిందట. ఈ క్రమంలో మూవీని నిర్మాతలు రిలీజ్ వాయిదా వేశారు.

అయితే, ఇదే ఏడాది డిసెంబర్ చివరికల్లా రిలీజ్ చేయాలనీ హాట్‌స్టార్‌ సూచించిందట. లేదంటే, తామే సంక్రాంతికి డైరెక్ట్ ఓటీటీలోనే రిలీజ్ చేస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు, ప్రభాస్ రాజాసాబ్ మూవీ డిసెంబర్ నుంచి సంక్రాంతికి షిఫ్ట్ అయింది. ఇపుడు రాజాసాబ్ రావాల్సిన డిసెంబర్ 5ని అఖండ 2 లాక్ చేసుకున్నట్లు టాక్. మరి హాట్‌స్టార్‌ పెట్టిన కండీషన్ ప్రకారం బోయపాటి ఎలాంటి యుద్ధం చేస్తాడో తెలియాల్సి ఉంది.

ఇకపోతే.. అఖండ 2లో బాలయ్యకు జోడిగా ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఆది పినిశెట్టి శక్తివంతమైన విలన్ పాత్రలో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి సి.రామ్‌ప్రసాద్, సంతోశ్‌ డిటాకే ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు.