సరికొత్త లుక్తో ఆకట్టుకుంటున్న నందమూరి మోక్షజ్ఞ

సరికొత్త లుక్తో ఆకట్టుకుంటున్న నందమూరి మోక్షజ్ఞ

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అసలు మోక్షజ్ఞ ఎలా ఉన్నాడో కూడా చాలా మందికి ఐడియా లేదు. బర్త్ డే సందర్భంగా అతడి పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. తన కొత్త మూవీ సెట్స్ లో మోక్షజ్ఞ బర్త్ డేను బాలయ్య సెలబ్రేట్ చేశాడు. తనయుడికి కేక్ తినిపించి విషెస్ చెప్పిన పిక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చాలా కాలం తర్వాత మోక్షజ్ఞ ఫొటోస్ చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.  త్వరలోనే తమ హీరో ఎంట్రీ ఉంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

మోక్షజ్ఞ మూవీ ఎంట్రీపై గతంలోనే పలు వార్తలు వచ్చాయి. అయితే అది వాయిదా పడుతూ వస్తోంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా లేకపోవడంతో అతని గురించి ఎటువంటి అప్ డేట్స్ తెలియక ఫ్యాన్స్ నిరాశ చెందేవారు. అయితే బర్త్ డే పిక్స్ చూసిన నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం బాలయ్య గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో వస్తున్న మూవీలో నటిస్తున్నాడు. శ్రుతిహాసన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ టీజర్ అంచనాలను పెంచేసింది.