బాలయ్యతో సెట్ చేసిన బాబీ.. ఇక బాక్సాఫీస్ బద్దలే

బాలయ్యతో సెట్ చేసిన బాబీ.. ఇక బాక్సాఫీస్ బద్దలే

బాలయ్య(Balakrishna) కోసం మరో మాస్ కాంబోను సెట్ చేశాడు నిర్మాత నాగ వంశీ(Naga vamshi). దీనికి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చాడు. జూన్ 10న ఈ క్రేజీ కాంబో అఫీషియల్ గా స్టార్ కానుంది. బాలకృష్ణ ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi)తో ఓ మాస్ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ షెరవేగంగా జరుగుతోంది. NBK108 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్(Kajal Agarwal) హీరోయిన్ గా నటిస్తోంది. లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల(Sreeleela) ఈ సినిమాలో బాలయ్యకు కూతురిగా నటిస్తోంది.

ఈ సినిమా తరువాత బాలయ్య మరోసారి మాస్ డైరెక్టర్ బోయపాటి(Boyapari Srinu)తో సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత బాబీ(Bobby)తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బాలకృష్ణ. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్(Sitara Entertainments) తెరకెక్కించనుంది. ఈమేరకు ట్విట్టర్ లో జూన్ 10th అంటూ హింట్ కూడా ఇచ్చాడు నాగ వంశీ. దీంతో నందమూరి ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. వాల్తేరు వీరయ్య(Valteru Veerayya) తరువాత డైరెక్టర్ బాబీ నుండి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగా నెలకొన్నాయి.

మరి మెగాస్టార్(Megastar Chiranjeevi) కి మెగా బ్లాక్ బస్టర్ ఇచ్చిన బాబీ.. బాలయ్య కు బాక్సాఫిస్ హిట్ ఇస్తాడా లేదా అనేది చూడాలి.