చిరు డైరెక్టర్ను లైన్లో పెట్టిన బాలయ్య

చిరు డైరెక్టర్ను లైన్లో పెట్టిన బాలయ్య

నందమూరి నటసింహం బాలకృష్ణ తన తరువాతి సినిమా కోసం మెగా డైరెక్టర్ ను లైన్లో పెట్టాడట. తాజాగా ఆ దర్శకుడు చెప్పిన కథ బాలయ్యకు బాగా నచ్చేసిందట. అందుకే వెంటనే ఒకే చెప్పేశాడట. ఆ డైరెక్టర్ మరెవరో కాదు.. కె ఎస్ రవీంద్ర(బాబీ). ఈ దర్శకుడు  తాజాగా మెగాస్టార్ కు వాల్తేరు వీరయ్య రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ ను అందించాడు.

గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న మెగాస్టార్ కు వాల్తేరు వీరయ్య అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపు 230 కోట్లు కొల్లగొట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక ఇదే ఊపును కొనసాగిస్తూ.. మరో యాక్షన్ ఎంటర్టైన్మెంట్ కథని సిద్ధం చేసాడట బాబీ. ఈ కథ బాలయ్య బాగా నచ్చిందట. అందుకే వెంటనే ఒకే చెప్పేసాడని సమాచారం.

ప్రస్తుతం బాలయ్య టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ మాస్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవగానే.. బాబీ సినిమా మొదలుపెట్టనున్నాడు బాలయ్య. మరి ఈ సినిమా కూడా వాల్తేరు వీరయ్య రేంజ్ లో భారీ హిట్ గా నిలుస్తుందా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.