IPL 2023: బాలయ్య కామెంటరీ..దబిడి దిబిడే..

IPL 2023: బాలయ్య  కామెంటరీ..దబిడి దిబిడే..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (IPL 2023) 16వ సీజన్ గ్రాండ్ గా ఆరంభమైంది. మార్చి 31వ తేదీ శుక్రవారం తొలి మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతోంది. తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతోంది.  ఈ సారి ఐపీఎల్ కోసం నటసింహం నందమూరి బాలకృష్ణ కొత్త అవతారం ఎత్తారు. ఐపీఎల్ ద్వారా బాలయ్య క్రికెట్ కామెంటేటర్ గా దర్శనమిచ్చాడు. ఈ నేపథ్యంలో బాలయ్య స్టార్ స్పోర్ట్స్ కామెంట్రీ బృందంతో జత కలిశారు. తనదైన శైలిలో చమక్కులతో మిగతా కామెంటేటర్లను కూడా నవ్వించారు. జై బాలయ్య అంటూ హోస్ట్ నందూ, ఇతర కామెంటేటర్లు ఆశిష్ రెడ్డి, కల్యాణ్ కృష్ణ తదితరులు బాలకృష్ణకు స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా బాలకృష్ణ స్కూల్ రోజులను గుర్తు చేసుకున్నారు. తాను స్కూల్ లో  క్రికెట్ ఆడేవాడినని చెప్పారు. కాలేజీ రోజుల్లో తనకు అజహరుద్దీన్, కిరణ్ కుమార్ రెడ్డి (మాజీ సీఎం) వంటి మేటి క్రికెటర్లతో పరిచయం కలిగిందన్నారు. ఆ తర్వాత స్టూడియోలోకి ఎమ్మెస్కే ప్రసాద్, వేణుగోపాల్ రావు కూడా ఎంట్రీ ఇచ్చారు. బాలయ్య వచ్చాడు... ఇవాళ దబిడిదిబిడే అంటూ ఇతర కామెంటేటర్లు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ ఐపీఎల్ లో తన ఓటు సన్ రైజర్స్ కే అని బాలకృష్ణ స్పష్టం చేశారు.