కొవిడ్ నుంచి కోలుకున్న హీరో బాలకృష్ణ

కొవిడ్ నుంచి కోలుకున్న హీరో బాలకృష్ణ

టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇటీవల బాల‌కృష్ణకు క‌రోనా పాజిటివ్ సోకింది. ఈ విష‌యాన్ని ఆయ‌నే అధికారికంగా ప్రక‌టించారు. డాక్టర్స్ స‌ల‌హాలు తీసుకుంటూ ఆయ‌న హోం ఐసోలేష‌న్ ఉన్నారు. రీసెంట్‌గా జ‌రిపిన కోవిడ్ టెస్టులో నెగెటివ్ రావ‌టంతో బాల‌కృష్ణ కోలుకున్నార‌ని డాక్టర్స్ తెలిపారు. ఈ క్రమంలో బాలకృష్ణ జూలై 9 నుంచి మళ్లీ 'జై బాలయ్య' సినిమా షూటింగ్ కు హాజరుకానున్నారు.