అవునయ్యా విగ్గు పెట్టుకుంటా.. మనదంతా ఓపెన్‌ బుక్‌ : హీరో బాలకృష్ణ

అవునయ్యా విగ్గు పెట్టుకుంటా.. మనదంతా ఓపెన్‌ బుక్‌ : హీరో బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ (BalaKrishna) హీరోగా, క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) డైరెక్ట్ చేస్తున్న మూవీ భగవంత్ కేసరి(Bhagavanth Kesari). బాలయ్య కు జోడిగా కాజల్(Kajal) నటిస్తుండగా.. శ్రీలీల(SreeLeela) కీలక పాత్రలో నటిస్తోంది. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా బాలకృష్ణ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 

హీరో బాలకృష్ణ మాట్లాడుతూ..'దేవాలయంలో భక్తులు చేసే ప్రదక్షిణలు, దైవ నామస్మరణం 108తో ముడిపడి ఉంటాయి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నా నుంచి వచ్చే భగవంత్ కేసరి దసరా పండగకి రిలీజ్ అవ్వడం విశేషం. ఎందుకంటే ఈ మూవీ నా కెరీర్ లో 108వ కావడం ఆనందంగా ఉంది. 

దుర్గమాత అంటే స్త్రీ పరశక్తి. భగవంత్ కేసరి మూవీ..ఒక సాధారణ మహిళ..అసాధారణ స్థాయికి ఎలా వచ్చిందో తెలిపే అద్భుత చిత్రం ఇది. డైరెక్టర్ అనిల్ ఈ సినిమా తెలంగాణ భాష విషయంలో చాలా రీసెర్చ్ చేశాడని తెలిపారు. అలాగే ఈ సినిమాలో టీజర్, ట్రైలర్ లో కనిపించే క్యారెక్టర్ కాకుండా మరొక పాత్ర కూడా ఉంటుందని..అది స్క్రీన్ పైనే చూడాలని ఆసక్తి కలిగించాడు బాలయ్య బాబు. 

బాలకృష అప్పట్లో షూటింగ్ డేస్ ను గుర్తు చేసుకుంటూ..సినిమాటోగ్రాఫర్‌ రామ్‌ ప్రసాద్‌ ఎప్పటి నుంచో తెలుసని..లొకేషన్లో కలిసే  భోజనం చేసేవాళ్లం అని..అప్పట్లో ఉండటానికి కారవాన్‌లు లేవని తెలిపారు. అలాగే చాప, దిండు వేసుకుని నేలపైనే పడుకునేవాళ్లం..ఆ టైములో విగ్గు తీసేసి ఉండేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు.

ఇదే విషయంపై..ఒకాయన స్పందిస్తూ..'బాలకృష్ణ విగ్గు పెట్టుకుంటాడు..అంటూ ఎగతాళిగా మాట్లాడాడు. అలా అనగానే..అవునయ్యా విగ్గు పెట్టుకుంటా..నువ్వు ఎందుకు గడ్డం పెట్టుకున్నావని అడిగా..దాంతో సైలెంట్ అయినట్లు చెప్పాడు. ఇక మనదంతా ఓపెన్‌ బుక్‌..ఎవరికీ భయపడేదే లేదని బాలకృష్ణ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.