Nandamuri Tejaswini: వెండితెరపై నందమూరి వారసురాలు.. స్టార్ హీరోయిన్ లా మెరుపులు!

Nandamuri Tejaswini: వెండితెరపై నందమూరి వారసురాలు.. స్టార్ హీరోయిన్ లా మెరుపులు!

నందమూరి కుటుంబం నుంచి ఒక వారసురాలు వెండితెరపై ఎంట్రీ ఇచ్చేసింది. తొలి సారి కెమెరా ముందుకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె ఎవరో కాదు ..  నటసింహం నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె, విశాఖపట్నం ఎంపీ భరత్ సతీమణి తేజస్విని. ఇన్నాళ్లు తన తండ్రి ప్రాజెక్టుల వెనుక ఉండి క్రియేటివ్ వ్యవహారాలను పర్యవేక్షించిన ఆమె .. ఇప్పుడు ఓ జ్యువెలర్స్ సంస్థ బ్రాండ్ కు అంబాసిడర్ గా మారింది.  తెరపై మెరిసింది.  తేజస్వినికి ఇదే తొలిసారి అయినా యాక్టింగ్ లో అనుభవం నటిగా ఒదిగిపోయింది. దీంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

తేజస్విని నటించిన ఈ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ యాడ్‌లో తేజస్విని ఆధునిక దుస్తుల్లో డైమండ్ రింగ్‌తో మెరుస్తూ, ఆ తర్వాత సాంప్రదాయ దుస్తుల్లో ఒంటినిండా ఆభరణాలతోనూ కనిపించారు. తొలిసారే కెమెరా ముందుకు వచ్చినప్పటికీ, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, గ్రేస్ , సహజమైన నటన అనుభవం ఉన్న నటిని తలపించాయి. యాడ్‌లో రాక్ క్లైంబింగ్ లాంటి సాహసోపేత సన్నివేశాల్లో పాల్గొనడం, అలాగే బృంద మాస్టర్ కొరియోగ్రఫీకి తగ్గట్టుగా అద్భుతమైన స్టెప్పులతో ఆకట్టుకుంది..

ALSO READ : ‘మాస్ జాతర’ సెన్సార్ రివ్యూ..

ఈ యాడ్‌కు దర్శకుడు వై. యమున కిషోర్ దర్శకత్వం వహించగా, థమన్ అందించిన సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచింది. సినీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం..  తేజస్వినికి మొదటి నుంచీ సినిమాలపై ఆసక్తి ఎక్కువ. అందుకే ఆమె ఇప్పటికే తన తండ్రి బ్లాక్‌బస్టర్ చిత్రం 'అఖండ 2'కి సహ నిర్మాతగా పనిచేస్తున్నారు. అంతేకాకుండా, త్వరలో తన సోదరుడు మోక్షజ్ఞ హీరోగా లాంచ్ కాబోయే చిత్రానికి కూడా నిర్మాతగా వ్యవహరించనున్నారు.

పలువురు అభిమానులు, నెటిజన్లు ఆమె అందాన్ని చూసి 'హీరోయిన్ మెటీరియల్' అంటూ కామెంట్లు పెడుతున్నారు. తెర వెనుక క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్న తేజస్విని, ఇకపై తెరపై కూడా ఇలాంటి అద్భుతమైన ప్రదర్శనలతో మెప్పించాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. ఈ యాడ్‌తో తేజస్విని తన కెరీర్‌లో ఒక కొత్త అధ్యాయాన్ని శ్రీకారం చుట్టినట్లేనని అభిప్రాయపడుతున్నారు. మరి సినిమాల్లో నటిస్తుందో లేదో ముందుముందు చూడాలి.