గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ట, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'అఖండ 2: తాండవం'. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ కు పూనకాలే. 'సింహా', 'లెజెండ్', 'అఖండ' వంటి బ్లాక్‌బస్టర్‌ల తర్వాత, ఈ డైనమిక్ ద్వయం నుండి వస్తున్న ప్రెస్టీజియస్ 'అఖండ' సీక్వెల్ ఇది. ఈ మూవీ 2021లో 'అఖండ' సృష్టించిన సునామీని మించి మరింత రౌద్రంగా, శక్తిమంతంగా ఉండబోతోందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి.
పాన్ ఇండియా స్థాయిలో..
'అఖండ 2: తాండవం' కేవలం తెలుగుకే పరిమితం కావడం లేదు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సారి ఏకంగా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ కావడానికి ఇంకా మూడు వారాలకు పైగా సమయం ఉన్నప్పటికీ అటు ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్‌లు ఇప్పుడే మొదలయ్యాయి. ఈ సీక్వెల్‌ను బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధికంగా, సుమారు రూ.200 కోట్లకు పైగా బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మించారు.
ముంబైలో సాంగ్ రిలీజ్..
పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నందమూరి కుటుంబం నుంచి ఎం. తేజస్విని నందమూరి ఈ ప్రాజెక్ట్‌ను సమర్పించడం ఈ సినిమాకు మరింత హైప్ ను తీసుకోచ్చింది.. ప్రస్తుతం చిత్రబృందం భారీ ప్రచారానికి సన్నద్ధమైంది. దేశవ్యాప్త బజ్ కోసం ఈ రోజు ( నవంబర్ 14న ) ముంబైలో 'అఖండ 2: తాండవం' నుంచి కొత్త పాటను గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ కు మహారాష్ట్ర నుంచి ఫ్యాన్స్ తరలివచ్చారు.
ఈ చిత్రంలో బాలకృష్ణ మరోసారి తన భీకరమైన, మర్మమైన అఘోరా అవతారంలో అలరించనున్నారు. ఈ పాత్ర మొదటి భాగంలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మళ్లీ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సీక్వెల్, ఆధ్యాత్మిక, పౌరాణిక అంశాలపై ఎక్కువగా దృష్టి సారించి, యాక్షన్, లోర్, బాలకృష్ణ యొక్క లార్జర్-దన్-లైఫ్ స్క్రీన్ ప్రెజెన్స్‌ను మిళితం చేయనుందంటున్నారు సినీ వర్గాలు.
►ALSO READ | Gopi Gaalla Goa Trip Review: ఫ్రెష్ టేకింగ్‌తో 'గోపి గాళ్ల గోవా ట్రిప్'.. రెగ్యులర్ సినిమాల నుండి భిన్నంగా!
ఈ సాంగ్ రిలీజ్ కు ముందు బాలకృష్ట, బోయపాటితో పాటు మూవీ టీం సిద్ధి వినాయక టెంపుల్ ను సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు తీర్ధప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఈ సినిమా కచ్చితంగా బాక్సీఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ పండితులు బలంగా నమ్ముతున్నారు.
#NandamuriBalakrishna & #BoyapatiSreenu visited the famous Shree Siddhivinayak Temple in Mumbai and took the divine blessings ahead of #TheThaandavamSong launch ✨🔱
— 14 Reels Plus (@14ReelsPlus) November 14, 2025
Grand launch event today at PVR Juhu, Mumbai from 5 PM onwards.
Watch Live here!
▶️ https://t.co/92J8YsFssv
A… pic.twitter.com/NmYkzgx8lj
