డెవిల్‌ ట్రైలర్‌ : ఆపరేషన్ టైగర్ హంట్

డెవిల్‌ ట్రైలర్‌  : ఆపరేషన్ టైగర్ హంట్

నందమూరి కల్యాణ్‌రామ్‌  బ్రిటిష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌గా నటించిన చిత్రం డెవిల్‌.  సంయుక్త మీనన్, మాళవిక నాయర్‌  హీరోయిన్లుగా నటించారు.  అభిషేక్‌ నామా స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పీరియాడికల్‌ స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను 2023 డిసెంబర్ 29 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది.  

ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకోవడంతోపాటు సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఓ మర్డర్ కేసును పరిశీలించడానికి మద్రాస్ నుంచి స్పెషల్ ఆఫీసర్ వస్తున్నాడంటూ  కళ్యాణ్ రామ్ ని చూపించారు.  ఓ బ్రిటిష్ అధికారి కళ్యాణ్ రామ్ కి ఆపరేషన్ టైగర్ హంట్ అనే మిషన్ ని అప్పగిస్తాడు .   డెవిల్ సీక్రెట్ ఏజెంట్‍గా కల్యాణ్ రామ్ లుక్, యాక్షన్ అదిరిపోయాయి.  విశ్వాసంగా ఉండడానికి.. విధేయతతో బతికేయడానికి కుక్కను అనుకున్నావా రా.. లయన్ అంటూ  కళ్యాణ్ రామ్ మీసం మెలేస్తూ చెప్పే డైలాగ్ ట్రైలర్ కు హైలెట్ గా నిలిచాయి. 

బింబిసార లాంటి సూపర్ డూపర్ హిట్ తరువాత కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ కలిసి నటిస్తున్న చిత్రం ఇదే కావడంతో అంచనాలు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. ఇందులో  మాళవిక నాయర్ చాలా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు.