Mokshagna, Prasanth Varma: బాలయ్య వారసుడు దిగుతున్నాడు..మోక్షజ్ఞ ఎంట్రీపై ప్ర‌శాంత్ వ‌ర్మ పోస్ట్!

Mokshagna, Prasanth Varma: బాలయ్య వారసుడు దిగుతున్నాడు..మోక్షజ్ఞ ఎంట్రీపై ప్ర‌శాంత్ వ‌ర్మ పోస్ట్!

నందమూరి బాలకృష్ణ (Balakrishna) కుమారుడు నందమూరి మోక్షజ్ఞ (Mokshagna)  టాలీవుడ్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇపుడు మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మ(Prasanth Varma) డైరెక్షన్ లో సినిమా షురూ కానుందని సమాచారం. 

ఇక ప్ర‌శాంత్ సినిమాటిక్ యూనివ‌ర్స్‌లో భాగంగా ఈ సినిమా రాబోతుండ‌గా.. తాజాగా సెప్టెంబర్‌ 5న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి సాలిడ్ అప్‌డేట్‌ను పంచుకున్నాడు డైరెక్టర్ ప్ర‌శాంత్ వ‌ర్మ‌. "సింబా వ‌చ్చేస్తున్నాడు..శుక్ర‌వారం ఉద‌యం 10.36 గంట‌ల‌కు సింబా ఫ‌స్ట్ లుక్" అంటూ ప్ర‌శాంత్ వ‌ర్మ ప్ర‌క‌టించాడు.

అయితే సెప్టెంబర్‌ 6న మోక్షజ్ఞ బర్త్‌డే సంద‌ర్భంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించి అధికారిక ప్రకటన చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ సినిమాకి బాలయ్య రెండో కూతురు తేజస్విని సహనిర్మాతగా వ్యవహరించబోతున్నారు.

అయితే సెప్టెంబర్ 3న చేసిన పోస్ట్ ఈ కాంబోకి బలాన్నిస్తుంది. ఓ సింహం తన పిల్లను ఎత్తుకొని చూపుతోన్న పోస్ట్‌ పెట్టిన ప్రశాంత్‌ వర్మ..‘నా యూనివర్స్‌ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది’ అని రాశారు. దీనికి ‘సింబా ఈజ్‌ కమింగ్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌ పెట్టారు. దీంతో మోక్షజ్ఞ ఎంట్రీని ఉద్దేశించే ప్రశాంత్‌ ఈ పోస్ట్‌ పెట్టారని అందరూ అనుకుంటున్నారు. ఏదేమైనా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ మూవీ చేస్తే కచ్చితంగా అది బ్లాక్ బాస్టర్ అవుతుందని బాలయ్య అభిమానులు కూడా బలంగా నమ్ముతున్నారు.