హీరో బాలకృష్ణ వైఫ్ సంతకం ఫోర్జరీ

హీరో బాలకృష్ణ వైఫ్ సంతకం ఫోర్జరీ

హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ భార్య వసుంధర సంతకాన్ని ఫోర్జరీ చేశాడు ఓ బ్యాంకు ఉద్యోగి. దీంతో నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నందమూరి వసుంధరకు బంజారాహిల్స్ లోని హెడీఎఫ్‌సీ బ్యాంక్ లో ఎకౌంట్ ఉంది. అయితే ఆమె మొబైల్ బ్యాంకింగ్ అప్లై చేసుకున్నట్లుగా బ్యాంకు అధికారులకు రిక్వెస్ట్ వచ్చింది. దీంతో బ్రాంచ్ మేనేజర్లు ఫణింద్ర, శ్రీనివాస్ ఈనెల 13న వసుంధర పీఏ వెలగల సుబ్బారావుకు ఫోన్ చేసి మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ కోసం వసుంధర దరఖాస్తు చేసుకున్నారని యాక్టీవ్ చేయడానికి ఫోన్ చేసినట్లు చెప్పారు. తాము మొబైల్ బ్యాంకింగ్ కోసం ఎటువంటి రిక్వెస్ట్ అప్లై చేయలేదని, సదరు ఫాం పై సంతకమే పెట్టలేదని వసుంధర   చెప్పారు.  దీంతో అధికారులు ఆరా తీయగా… బ్యాంకులో కొత్తగా జాయిన్ అయిన అకౌంటెంట్ కొర్రి శివ అనే అతను వసుంధర సంతకాన్ని ఫోర్జరీ చేశాడని తెలుసుకున్నారు. ఈ విషయంపై శివను నిలదీయగా తాను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదుతో కొర్రి శివపై పోలీసులు కేసునమోదు చేశారు.