వ్యాక్సినేషన్ కు రెండేళ్లు పడుతుంది: నందన్ నీలేకని

వ్యాక్సినేషన్ కు రెండేళ్లు పడుతుంది: నందన్ నీలేకని

బెంగళూరు: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, చైర్మన్ నందన్ నీలేకని కరోనా వ్యాక్సిన్ గురించి పలు విషయాలు మాట్లాడారు. ఆధార్ కార్డ్ రూపొందించడంలో ప్రముఖ పాత్ర పోషించిన నీలేకని ప్రజలకు వ్యాక్సినేషన్ ఇవ్వడంలో ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. కరో్నా వ్యాక్సిన్ కు ఎన్ రోల్మెంట్ చేయించుకోవాలని, దీని కోసం హెల్త్ కేర్ సెక్టార్ లో వాట్సాప్ మూమెంట్ అవసరం ఉందన్నారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించి వివరాలను ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు రూపంలో డిజిటల్ హెల్త్ ఐడీతో భద్రపరచాలన్నారు.

‘ఆధార్ విషయంలో వంద కోట్ల ప్రజల వివరాలను ఐదున్నరేళ్ల కాలంలో సేకరించాం. వ్యాక్సినేషన్ ను చాలా వేగంగా పూర్తి చేయొచ్చు. రెండేళ్ల వ్యవధిలో దీన్ని ఫినిష్ చేయొచ్చు. ఈ ప్రక్రియ ఆధార్ ఎన్ రోల్మెంట్ లాగే ఉంటుంది. టెక్ బేస్డ్ గా దీన్ని పూర్తి చేయొచ్చు. వ్యాక్సినేషన్ కు దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి అది పూర్తయ్యేదాకా సర్టిఫకేట్స్ రూపంలో మొత్తం డిజిటల్ విధానంలో దీన్ని తయారు చేయాలి’ అని నీలేకని సూచించారు.