
‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ సినిమాతోనే సక్సెస్ అందుకుంది నందితా శ్వేత. తర్వాత గ్లామర్ రోల్స్‌తో పాటు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో కనిపించింది. ‘అక్షర’ లాంటి మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ ఫిమేల్ లీడ్‌గా ఆకట్టుకుంది. తాజాగా సింగిల్ క్యారెక్టర్‌లో నటించిన ‘రారా.. పెనిమిటి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొత్త దర్శకుడు సత్యవెంకట్ దీన్ని రూపొందిస్తున్నాడు. ప్రమీల నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
శుక్రవారం ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ‘అమ్మాయి గారు ఆషామాషీ పిల్ల కాదండోయ్. ఆ గడుసుతనం, ఎటకారం, కొంటెతనం, కోపగించుకోవడం, అలగడం’ అంటూ సునీల్ వాయిస్ ఓవర్‌తో నందిత క్యారెక్టర్‌ను పరిచయం చేశారు. కొత్తగా పెళ్లైన ఆమె.. తన భర్త రాక కోసం ఎదురుచూస్తూ, ట్రెడిషినల్ గెటప్‌లో ఉన్న లుక్ ఆకట్టుకుంది. త్వరలో సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామన్నారు దర్శక నిర్మాతలు.