
- . సోషల్ మీడియాలో వైరల్
సిద్ధిపేట, వెలుగు: సర్పంచ్ గా గెలిపించాలంటే బాండ్ పేపర్ పైసంతకం పెట్టి...నామినేషన్వేయాలంటోంది నంగునూరు మండల యువత. అక్రమ ఆస్తులు సంపాదించను. ఐదేండ్ల తర్వాత ఆస్తులు పెరిగితే వాటిని గ్రామానికే అప్పగి స్తా, గ్రామ పంచాయతీ పనుల కోసం ప్రజల వద్ద డబ్బులు అడగను, తప్పుడు లెక్కలు చూపను. గ్రామ అభివృద్ధికి సేవకుడిగా పని చేస్తానని వారు రూపొం దించిన బాండ్ పేపర్ గురువారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.