నా కొడుకు గర్వపడేలా హాయ్ నాన్న : నాని

నా కొడుకు గర్వపడేలా  హాయ్ నాన్న : నాని

నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘హాయ్ నాన్నా’. బేబీ కియారా ఖన్నా కీలకపాత్ర పోషిస్తోంది. శౌర్యువ్ దర్శకత్వంలో మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. డిసెంబర్ 7న సినిమా విడుదల కానుంది. ఆదివారం టీజర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో నాని మాట్లాడుతూ ‘చాలా యూనిక్ సబ్జెక్ట్ ఇది. అన్ని వయసుల ప్రేక్షకులకూ నచ్చే కమర్షియల్ మూవీ.

బేబి కియారా చాలా అద్భుతంగా చేసింది. ఈ సినిమాతో తను ప్రేక్షకుల మనసుని టచ్ చేస్తుంది. జెర్సీ, హాయ్ నాన్న లాంటి సినిమాలు అర్ధం చేసుకొనే వయసు మా అబ్బాయికి  వుందో లేదో తెలీదు. కానీ ఏదో ఒక రోజు ఈ సినిమాలు చూసి గర్వపడతాడని నా నమ్మకం. ఇక ఒక ఇంట్లో పెద్ద అబ్బాయికి సంబధించిన ఏదైనా వేడుక వుంటే.. చిన్నోడి వేడుకని ముందుకు, వెనక్కి జరపడం కామన్.

‘సలార్‌‌‌‌‌‌‌‌’ వల్ల జరిగిన మార్పులు అలాంటివే. డిసెంబర్ అంతా ఒక లవ్ స్టొరీ, యాక్షన్ సినిమాలతో కళకళలాడిపోతుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘అంతా నాన్న చుట్టూ తిరిగే కథ. ఒక మంచి కథ రాసి సినిమా తీశాం. అదెలాఉందో ప్రేక్షకులు చెప్పాలి. మొదటి సినిమానే పాన్ ఇండియా కావడం హ్యాపీ’ అన్నాడు. బేబీ కియారా ఖన్నా, నిర్మాతలు మోహన్, విజయేందర్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ పాల్గొన్నారు.