నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 24న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నాని మాట్లాడుతూ ‘నా కెరీర్‌లో ఒక సినిమాకు మరో సినిమాకు ఇంత గ్యాప్ ఎప్పుడూ రాలేదు. మొదటి సినిమాకు నెర్వస్ ఫీలైనట్టు ఉంది.
ఫైనల్‌గా ఈనెల 24న వస్తున్నాం. ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. సినిమా కూడా ప్రేక్షకులకు ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. అందరి అంచనాలకు తగ్గకుండా సాలిడ్‌గా సినిమా ఉంటుంది. సమయం ఎక్కువ లేకపోవడంతో ట్రైలర్ రాకుండానే సినిమా రిలీజ్ చేయబోతున్నాం’ అని చెప్పాడు.
శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ ‘ఇప్పటికే వచ్చిన గ్లింప్స్, సాంగ్స్‌కు మంచి సపోర్ట్ అందించారు. ఇది శ్రీకాంత్ ఓదెల సినిమా కంటే జనం సినిమా అనొచ్చు. అంతలా ప్రతి కంటెంట్‌ను ఆదరిస్తున్నారు. ఈ సినిమా కోసం చాలామంది ఎక్సయిటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇదొక తల్లీకొడుకుల కథ. ఒక సవారీ జాతి కథ. ప్రతి ఒక్కరికీ డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది’ అని చెప్పాడు. బెస్ట్ అవుట్‌పుట్‌తో ఈ సినిమాను తీసుకొస్తున్నాం అని నిర్మాత సుధాకర్ చెరుకూరి అన్నారు.
