హాయ్ నాన్న Vs ఎక్స్ట్రా..టికెట్ల రేట్లు ఎలా ఉన్నాయంటే?

హాయ్ నాన్న Vs ఎక్స్ట్రా..టికెట్ల రేట్లు ఎలా ఉన్నాయంటే?

నాని (Nani) హీరోగా..శౌర్యవ్ (Shouryuv) డైరెక్షన్ లో వస్తోన్న మూవీ హాయ్ నాన్న(Hi Nanna).  నాని 30వ సినిమాగా వస్తోన్న ఈ మూవీ రేపు (డిసెంబర్ 7న) రిలీజ్ కాబోతుంది.లవ్ స్టోరీ, తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ మేళవింపుతో ఉన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సినిమా ప్రమోషన్స్ విషయంలో నాని విభిన్నమైన శైలిలో అన్ని రకాల ఆడియన్స్ ను అట్ట్రాక్ట్ చేస్తూ వస్తున్నారు.

ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ ప్రేక్షకుల హృదయాలని హత్తుకునేలా చేసింది. మొత్తంగా 2 నిమిషాల 40 సెకన్ల పాటు ఉన్న ఈ ట్రైలర్ ఆడియాన్స్ను మెస్మరైజ్ చేస్తోంది.ఇందులో ప్రతి క్యారెక్టర్ మధ్య వచ్చే సీన్స్..డైలాగ్స్ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ మూవీని నిర్మించారు. 

అలాగే ఈ సినిమాతో పాటుగా వస్తోన్న నితిన్ (Nithiin) నటించిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్(Extraordinaryman).. మూవీ (డిసెంబర్ 8న) శుక్రవారం థియేటర్లలోకి రాబోతుంది. ఇక నితిన్ ఎక్స్ ట్రాట్రైలర్  మాత్రం యూత్ ఫుల్ కమర్షియల్ ఎంటర్టైన్ గా ఆడియన్స్ ను ఆద్యంతం నవ్విస్తోంది. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.ప్రముఖ కథానాయకుడు రాజశేఖర్‌ ఓ కీలక పాత్రని పోషించారు.

ఎన్‌.సుధాకర్‌ రెడ్డి, నిఖితారెడ్డి శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించారు. ఈ రెండు సినిమాలు కూడా వేటికవే భిన్నంగా ఉండడంతో ఫ్యాన్స్ కి ఈ వారం పండుగనే చెప్పుకోవాలి. ఆడియన్స్ లో ఇంతటి హైప్ ఉన్న ఈ సినిమాల టికెట్ల రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 

టికెట్ రేట్లు ఎలా ఉన్నాయంటే? 

రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే..ముందుగా తెలంగాణలోని సింగిల్ స్క్రీన్స్ లలో అత్యధికంగా రూ.175 వరకు ఉండగా..మల్టీప్లెక్స్ లలో మాత్రం అత్యధికంగా టికెట్ ధర రూ.295 వరకు ఉన్నట్లుగా సమాచారం. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో చూసుకుంటే ఎప్పటిలాగే గవర్నమెంట్ పర్మిటెడ్ రేట్లు కేటాయించారు. సింగిల్ స్క్రీన్స్ లలో రూ.145 ఉండగా..మల్టీప్లెక్స్ లలో అత్యధికంగా రూ.177 రేంజ్ లో టికెట్ రేట్లు ఉన్నాయి. 

దాదాపు ఈ రెండు సినిమాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో సమానమైన థియేటర్స్ దొరికిన్నట్టు సమాచారం. అంతేకాకుండా ఇంచుమించు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఒకే రేంజ్ లో జరిగినట్లుగా తెలుస్తోంది. నాని హాయ్ నాన్న మాత్రం మిగతా భాషల్లో కూడా రిలీజ్ కాబోతుంది. మరి ఈ క్రేజీ స్టార్స్ మూవీస్ థియేటర్స్ లో ఎలా అట్ట్రాక్ట్ చేస్తాయో చూడాలి.