హాయ్ నాన్న మూవీ హిట్టా ఫట్టా.? లెక్కలు చెప్పేసిన మేకర్స్

హాయ్ నాన్న మూవీ హిట్టా ఫట్టా.? లెక్కలు చెప్పేసిన మేకర్స్

నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా వచ్చిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ హాయ్ నాన్న(Hi Nanna). కొత్త దర్శకుడు శౌర్యువ్(Shouryuv) తెరకెక్కించిన ఈ ఎమోషనల్ ఎంటర్టైనర్ లో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరోయిన్ గా నటించారు. టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుండే పాజిటీవ్ టాక్ ను తెచ్చుకుంది హాయ్ నాన్న మూవీ. అయితే ఏమైందో తెలియదు రెండో రోజునుండి డివైడ్ టాక్ వచ్చింది. దీంతో బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకున్న ఈ సినిమా జస్ట్ యావరేజ్ హిట్ గా నిలిచింది. 

నిజానికి హాయ్ నాన్న సినిమాపై ముందు నుండి మంచి అంచనాలే ఉన్నాయి. కారణం.. ఎమోషన్ బ్యాక్డ్రాప్ లో నాని చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. అదే సెంటిమెంట్ ఈ సినిమాకు కూడా వర్కౌట్ అవుతుంది అనుకున్నారు కానీ.. ఈసారి మాత్రం అనుకున్నది జరగలేదు. హాయ్ నాన్న చూసిన చాలా మంది సినిమా బాగుంది కానీ.. ఎదో మిస్ అయ్యింది అంటూనే బయటకు వచ్చారు. దీంతో ఈ సినిమా హిట్టా?ఫట్టా? అనే విషయంపై క్లారిటీ రాలేదు. 

తాజాగా ఇదే విషయంపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఎట్టకేలకు హాయ్ నాన్న ఫైనల్ కలెక్షన్స్ ను బయటపెట్టారు. ఈ సినిమాకు ఓవర్ ఆల్ గా రూ.75 కోట్ల గ్రాస్ వచ్చినట్టు ప్రకటించారు. దీంతో ఈ సినిమా క్లీన్ హిట్ లిస్టులోకి చేరిపోయిందని క్లారిటీ ఇచ్చేశారు. ఇక హాయ్ నాన్న సినిమాకు రూ.40 కోట్ల బడ్జెట్ అవగా.. రూ.45 కోట్ల బ్రేక్ ఈవెన్ తో థియేటర్స్ లోకి వచ్చింది. దీంతో ఈ సినిమా నిర్మాతలకు కొంతమేర లాభాలు తెచ్చిపెట్టిందని చెప్పాలి. ఇక ఈ విషయం తెలియడంతో నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అంతేకాదు.. 2023 మొదట్లో దసరా తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టిన నాని.. ఏడాది చివర్లో హాయ్ నాన్నతో మరో డీసెంట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.