
న్యాచురల్ స్టార్ నాని (Nani) హీరోగా..శౌర్యవ్ (Shouryuv) డైరెక్షన్లో ఫీల్ గుడ్ సక్సెస్ను అందుకొన్న మూవీ హాయ్ నాన్న (Hi Nanna). హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ, కంటతడి పెట్టించే తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ ఈ చిత్రానికి ప్రాణం పోసింది. దీంతో నాని కెరీర్లో మరో అద్భుతమైన మూవీగా హాయ్ నాన్న నిలిచింది.డిసెంబర్ 7న రిలీజైన ఈ మూవీ థియేటర్లలో ఆడియెన్స్‌ను మెప్పించి జనవరిలో ఓటీటీ అభిమానులను అలరించడానికి సిద్ధమవుతోంది.
ఇప్పటికే హాయ్ నాన్న డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నది. థియేట్రికల్ రిలీజ్‌కు ముందే భారీ ధరకు ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో హాయ్ నాన్న థియేటర్‌లో రిలీజైన నలభై రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేసేలా ఈ సినిమా ప్రొడ్యూసర్స్ నెట్‌ఫ్లిక్స్ సంస్థతో అగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం.
అలా చూసుకుంటే, హాయ్ నాన్న జనవరి 19 లేదా జనవరి 26 నుంచి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ థియేటర్స్లో సినిమా రన్ అవుతుండటంతో.. సంక్రాంతికి రిలీజ్ అవుతుందనే వస్తోన్న వార్తల్లో నిజం లేదని సమాచారం. ఇక హాయ్ నాన్న ఓటీటీ రిలీజ్ డేట్పై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాలో ముఖ్యంగా తండ్రీ కూతుళ్ల పాత్రలు, వారిద్దరి మధ్య సాగే సన్నివేశాలు, భావోద్వేగాలు హైలైట్ గా నిలిచాయి. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తోన్నారు