ఇంటెన్సిఫైడ్ టైటిల్ గ్లింప్స్తో.. నాని సరిపోదా శనివారం

ఇంటెన్సిఫైడ్ టైటిల్ గ్లింప్స్తో.. నాని సరిపోదా శనివారం

దసరా పండుగ (అక్టోబర్23) సందర్బంగా కొత్త సినిమాను ప్రకటించాడు నాని. అంటే సుందరానికి సినిమాతో ఆయనకు ప్లాప్ ఇచ్చిన దర్శకుడు వివేక్ ఆత్రేయ(Vivek athreya)తో నాని తన 31(Nani31)వ సినిమాను చేయనున్నాడు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ DVV ఎంటర్టైన్మెంట్స్(DVV Entertainments) బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది.

నాని 31 వ సినిమాగా వస్తోన్న ఈ మూవీకు సరిపోదా శనివారం అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. అలాగే టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్ కూడా విడుదల చేశారు. పోస్టర్ లో నాని చేతికి సంకెళ్లు..భీకరమైన అరుపుతో ఉన్న ఇంటెన్సిఫైడ్ ఫస్ట్ లుక్ అదిరిపోయింది. మరింత క్లోజ్గా  పోస్టర్ను గమనిస్తే.. నాని బంధించబదినట్టుగా లేడు.. సంకెళ్లు తెంచుకుని జయించటానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక టైటిల్ గ్లింప్స్లో..మన పెద్దలు ఒక మాట అనేవారు..రాజుకైనా, బంటుకైనా, ఎలాంటి వాడికైనా ఓ రోజు వస్తోంది..ఇపుడు కొత్త తరం వాళ్ళు మాత్రం.. నీకంటూ ఒక టైం వస్తుంది అంటారు. కానీ ఏ తరం వాళ్ళైకైనా.. కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసేది..ఆ ఒక్క రోజు గురుంచే. అది ఒకడికి వారానికి ఓ రోజు వస్తే..వాడ్ని ఎవడైనా ఆపగలడా? అదే శనివారం..సరిపోదంటారా..అని  సాయి కుమార్ చెప్పే ఇంటెన్స్ డైలాగ్ తో టైటిల్ గ్లింప్స్ అదిరిపోయింది.

మాస్ లుక్లో గంభీరంగా కనిపిస్తోన్న నాని..ఈ మూవీతో మరో హిట్ కొట్టడం కన్ఫర్మ్ అనిపిస్తోంది. ఈ సారి డైరెక్టర్ వివేక్ ఆత్రేయ సాలిడ్ స్క్రిప్ట్ తో.. నానికి హిట్ ఇవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యినట్టుగా టైటిల్ గ్లింప్స్ ఉంది. ఈ మూవీకి జేక్స్ బేజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే దసరా (Dasara) సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నాని.. త్వరలో ఎమోషనల్ కంటెంట్ తో తెరకెక్కిన హాయ్ నాన్న(Hi Nanna) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు