The Paradise Box Office: నాని కెరీర్‌లోనే ఆల్‌టైమ్ రికార్డ్.. 'ది ప్యారడైజ్' ఫస్ట్ డే అఫిషియల్ కలెక్షన్స్ ఎంతంటే?

The Paradise Box Office: నాని కెరీర్‌లోనే ఆల్‌టైమ్ రికార్డ్.. 'ది ప్యారడైజ్' ఫస్ట్ డే అఫిషియల్ కలెక్షన్స్ ఎంతంటే?

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా 'ది పారడైజ్' (The Paradise). భారీ అంచనాల మధ్య ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉదయం తొలి ఆటల నుంచే థియేటర్లు హౌస్‌ఫుల్ కాగా.. ఓవర్సీస్ తో పాటు హిందీ, తమిళ మార్కెట్లలోనూ ఊహించని రీతిలో వసూళ్లు సాధిస్తోంది. నాని కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.

'దసరా' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబో అనౌన్స్ అయిన క్షణం నుంచే ఈ 'ది ప్యారడైజ్'పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. 'జడల్ జమానా' అంటూ మేకర్స్ ఇచ్చిన హైప్‌ను ఏమాత్రం తగ్గించకుండా.. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తోంది. థియేటర్లలో కొంత మిక్స్‌డ్ టాక్ వినిపించినప్పటికీ, కలెక్షన్ల విషయంలో మాత్రం తగ్గడంలేదు.

చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం నాటి ప్రీమియర్లతో కలిపి తొలిరోజే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 88 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించి రికార్డులు తిరగరాసింది. నాని సినీ కెరీర్‌లోనే ఇది సరికొత్త మైలురాయిగా.. బిగ్గెస్ట్ డే-1 ఓపెనర్‌గా నిలిచింది. ఇండియాలోనే తొలిరోజు రూ. 47 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదు కావడం విశేషం. దీంతో నాని గత హిట్ చిత్రాలు 'దసరా' (రూ. 23.20 కోట్లు), 'హిట్: ది థర్డ్ కేస్' (రూ. 21 కోట్లు) ఫస్ట్ డే రికార్డులన్నీ పటాపంచలయ్యాయి.

నాని రఫ్ అండ్ రా మాస్ నటన, శ్రీకాంత్ ఓదెల విజన్, టేకింగ్ ఈ సినిమాకు ప్రాణంగా నిలిచాయి. దానికి తోడు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన బీజీఎమ్ థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తోంది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించారు. మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేశ్ బాబు కీలక పాత్రల్లో అలరించారు. కీర్తి సురేశ్ ప్రత్యేక పాత్ర సినిమాకు మరో అసెట్ గా మారింది. భారీ అడ్వాన్స్ బుకింగ్స్, వీకెండ్ కలుస్తుండటంతో రాబోయే మూడు రోజుల్లో ఈ కలెక్షన్ల సునామీ మరిన్ని కొత్త రికార్డులను సృష్టించడం ఖాయం అని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.