The Paradise : నాని 'ది పారడైజ్': శివగామిని తలపించే పవర్‌ఫుల్ పాత్రలో సోనాలీ కులకర్ణి!

 The Paradise : నాని 'ది పారడైజ్': శివగామిని తలపించే పవర్‌ఫుల్ పాత్రలో సోనాలీ కులకర్ణి!

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ది పారడైజ్'. వీరిద్దరి కలయికతో గతంలో వచ్చిన 'దసరా' మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి కలిసి పనిచేయడంతో ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఆకాశానికి తాకాయి.  పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ చిత్రం కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఒకటి వైరల్ అవుతోంది.

కథానాయకుడి తల్లి పాత్రలో...

ప్రముఖ బాలీవుడ్ నటి సోనాలీ కులకర్ణి యొక్క ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను లేటెస్ట్ గా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో ఆమె అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని మేకర్స్ తెలిపారు.  విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సోనాలీ కులకర్ణి పాత్ర కథానాయకుడి తల్లి పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఈ పాత్రను ప్రస్తుత కాలపు 'శివగామి'గా వర్ణిస్తున్నారు. ఆమె చూపించే పట్టుదల, తీసుకునే నిర్ణయాలు సినిమా గమనాన్ని మారుస్తాయని అభిప్రాయపడుతున్నారు. బాహుబలిలో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్ర ఎంతటి ప్రభావం చూపిందో, ఇందులో సోనాలీ పాత్ర కూడా అంతే శక్తిమంతంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో సోనాలి పాత్ర అత్యంత శక్తివంతమైనది నిలవనుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

 

 సంచలనం సృష్టించిన 'రా స్టేట్‌మెంట్'

'ది పారడైజ్' చిత్రం యొక్క 'రా స్టేట్‌మెంట్' (Raw Statement) ఇటీవలే విడుదలై పెద్ద చర్చకు దారితీసింది. ఆ ప్రకటనలో కథానాయకుడి తల్లి అతన్ని ఒక 'వేశ్య కొడుకు'గా ప్రకటించడం తీవ్ర ఉత్కంఠను రేకెత్తించింది. ఇటువంటి బలమైన సంభాషణతో కూడిన పాత్రపై అంచనాలు పెరగగా, సోనాలీ కులకర్ణి ఫస్ట్‌లుక్ పోస్టర్ ఆ పాత్ర యొక్క పవర్‌ఫుల్ టోన్‌ను ఖచ్చితంగా సెట్ చేసింది. పోస్టర్‌లో ఆమె లుక్, ఆ పాత్ర యొక్క గాంభీర్యాన్ని ప్రతిబింబిస్తోంది.

 గ్లోబల్ రిలీజ్ 

శ్రీకాంత్ ఓదెల తన మొదటి చిత్రం 'దసరా' తోనే అద్భుత విజయాన్ని అందుకున్నారు. ఆ మూవీ రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, నాని కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా నిలిచింది. అతి తక్కువ చిత్రాలతోనే సినీ పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన శ్రీకాంత్, 'ది పారడైజ్'తో తన ప్రత్యేకమైన విజన్‌ను మరోసారి ప్రదర్శించి, తన స్థాయిని పెంచుకోనున్నారు. ఈ చిత్రానికి యువ సంచలనం అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. అనిరుధ్, అర్జున్ చాందీ గాత్రం అందించిన ఒరిజినల్ సౌండ్‌ట్రాక్ ఇప్పటికే విడుదల కాకముందే సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. 

►ALSO READ | Prabhu Deva, Anasuya: ప్రభుదేవాకు మత్తెక్కిస్తున్న అనసూయ .. రొమాంటిక్ పాటతో హీట్ పెంచేశారుపో!!

'దసరా' వంటి భారీ చిత్రాన్ని నిర్మించిన SLV సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ 'ది పారడైజ్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  మార్చి 26, 2026 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రం ఏకంగా  హిందీ, తెలుగు, తమిళం, ఇంగ్లీష్, స్పానిష్, బెంగాలీ, కన్నడ, మరియు మలయాళం భాషల్లో విడుదల చేస్తున్నారు.