Prabhu Deva, Anasuya: ప్రభుదేవాకు మత్తెక్కిస్తున్న అనసూయ .. రొమాంటిక్ పాటతో హీట్ పెంచేశారుపో!!

Prabhu Deva, Anasuya: ప్రభుదేవాకు మత్తెక్కిస్తున్న అనసూయ .. రొమాంటిక్ పాటతో హీట్ పెంచేశారుపో!!

ఇండియన్ టాప్ డాన్స్ మాస్టర్ ప్రభుదేవా (Prabhu Deva) హీరోగా ‘వుల్ఫ్’ (Wolf) అనే కొత్త మూవీలో నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ మూవీని వినూ వెంకటేష్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీలో అనసూయ భరద్వాజ్, అంజు కురియన్, లక్ష్మీ రాయ్, MS భాస్కర్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీకు అంబరీషన్ మ్యూజిక్ అందిస్తున్నారు. 

లేటెస్ట్గా వుల్ఫ్ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘సాసా సాసా’ అంటూ సాగే రొమాంటిక్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రభుదేవాతో పాటుగా గ్లామర్ బ్యూటీస్ అనసూయ, లక్ష‍్మీ రాయ్, మరో నటి క్రేజీ స్టెప్పులు వేశారు. ఈ ముగ్గురు భామలు తమ వయ్యారాలతో, అందాలతో ప్రభుదేవాకు మత్తెక్కించే పనిలో పడ్డారు. ఏదో నిగూఢమైన సమాచారాన్ని రాబట్టేందుకు, ప్రభుదేవాని మత్తులో దించి కాకా రేపుతున్నారు. ఇపుడు ఈ ‘సాసా’ సాంగ్ కుర్రాళ్లకు పిచ్చెక్కించేలా ఉంది. 

ఇదిలా ఉంటే.. వుల్ఫ్ మూవీ 2022లోనే షూటింగ్ స్టార్ట్ అయింది. 2023 ఆగస్ట్లో టీజర్ విడుదలైంది. కానీ, ఈ మూవీ రిలీజ్ అవ్వకుండా పోస్ట్ ఫోన్ అవుతూ వస్తుంది. అయితే, టీజర్ రిలీజైన అప్పట్నుంచి.. ఇప్పటికీ ఒక్క అప్డేట్ కూడా రాలేదు. కానీ, సడెన్ సర్ప్రైజ్ ఇస్తూ..  'సాసా' అంటూ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే 'ఎప్పుడొచ్చామని కాదు.. ఎంత హైప్ ఇచ్చామనేది ముఖ్యం' అనేలా వుల్ఫ్ మేకర్స్ వచ్చారు. 

ప్రభుదేవా వుల్ఫ్ టీజర్ విషయానికి వస్తే.. వెరీ ఇంటెన్సివ్ లుక్తో ప్రభుదేవా కనిపించారు. ఒక తోడేలు రెక్కలు, కొమ్ములు ఆకారంలో ఒక మనిషి లాంటి విగ్రహం..దాని ముందు పడుకోబెట్టిన ఒక మనిషితో.. ఉన్న విజువల్స్ ఆకట్టుకున్నాయి. అనసూయ అరాచకత్వం ఒకవైపు, మరోవైపు ఏదో మాయలోకంలో కన్యలా కనిపిస్తూ ఆకర్షిస్తుంది.

►ALSO READ | Actress Divi: న్యూస్ పేపర్‌కు నిప్పులు పుట్టిస్తున్న దివి.. కొత్త కాస్ట్యూమ్‌లో కుర్రాళ్లకు పిచ్చెక్కాల్సిందే

ఇకపోతే, ప్రభుదేవా కోరియోగ్రఫర్‌‌‌గా సినీ కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత యాక్టర్గా మారి డైరెక్టర్గా సత్తా చాటుతున్నారు. ఈ మూవీను సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై సందేశ్ నాగరాజ్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.