Actress Divi: న్యూస్ పేపర్‌కు నిప్పులు పుట్టిస్తున్న దివి.. కొత్త కాస్ట్యూమ్‌లో కుర్రాళ్లకు పిచ్చెక్కాల్సిందే

Actress Divi: న్యూస్ పేపర్‌కు నిప్పులు పుట్టిస్తున్న దివి.. కొత్త కాస్ట్యూమ్‌లో కుర్రాళ్లకు పిచ్చెక్కాల్సిందే

టాలీవుడ్ నటి, బిగ్‌బాస్‌ ఫేం దివి (DIVI) కొత్త ఫోటోలు షేర్ చేసింది. ఎప్పటికప్పుడు తన కొత్త ఫొటోలతో కాకా పుట్టించే దివి.. ఈసారి మరింత కొత్త భంగిమ‌ల్లో ఫోజులిచ్చింది. ఇపుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పేప‌ర్ చొక్కా ధరించి ఓ రేంజ్లో అందాలను ఆరబోసింది. ఇపుడు ఈ క్రేజీ ఫోటోలు నెటిజన్స్ దృష్టిని వీపరీతంగా ఆకర్షిస్తున్నాయి.

ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్.. కొంతమంది  టైట్ ఫిట్ పొట్టి డ్రెస్లో అట్ట్రాక్ట్ చేస్తే, మరికొందరు పద్ధతైన లుక్ లో కనిపించి ఆకట్టుకుంటారు.. కానీ, దివి మాత్రం అన్నీ హంగులతో రెచ్చిపోతూ, నెటిజన్స్ని తనవైపు తిప్పేసుకుంటోంది.

ఈ క్రమంలో కొంతమంది "న్యూస్ పేపర్‌కు నిప్పులు పుట్టిస్తున్న దివి.. కొత్త కాస్ట్యూమ్‌లో కుర్రాళ్లకు పిచ్చెక్కాల్సిందే" అని అంటుండగా మరోవైపు  "ఏదో రోజు స్టార్ అవుతావు.. కాలేజీ స్టూడెంట్ నుండి - ఫ్యాష‌నిస్ట్గా, ఫ్యాష‌నిస్ట్ నుండి - ఆర్టిస్ట్గా.. ఇక చివరగా.. ఏదోరోజు ఆర్టిస్ట్ నుండి స్టార్గా ఎదుగుతావు" అని కామెంట్స్ పెడుతున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Divi (@actordivi)

దివి సినిమాలు:

బిగ్బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన బ్యూటీ దివి. బిగ్బాస్ కంటే ముందు పలు సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు. బిగ్బాస్ తో మాత్రం మంచి ఫేమ్ సంపాందించుకుంది. సీజన్ 4లో కంటెస్టెంట్గా పాల్గొని తన ఆట తీరుతోపాటు అందం, అభినయంతో యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికొచ్చాక.. అందరిలానే ఆమె కూడా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. వరుస ఆఫర్లు అందుకుంది. వెబ్ సిరీస్ లతోపాటు సినిమాలూ చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. దాంతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటోంది.

మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. ప్రస్తుతం దివి సినిమాలు, వెబ్ సిరిస్ లలో నటిస్తూ బిజీగా ఉంది. ఏ 1 ఎక్స్‌ప్రెస్, గాడ్ ఫాదర్, రుద్రంగి, లంబసింగి, హరికథ, డాకు మహారాజ్ వంటి సినిమాల్లో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలు, సిరీస్ లతో బిజీగా ఉంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Divi (@actordivi)