#Nani32 Official: గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో నాని,సుజీత్ మూవీ.. వీడియో మాత్రం నెక్స్ట్ లెవల్

#Nani32 Official: గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో నాని,సుజీత్ మూవీ.. వీడియో మాత్రం నెక్స్ట్ లెవల్

నేచురల్ స్టార్ నాని(Nani) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే హాయ్ నాన్న(Hi Nanna) సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న నాని.. ప్రస్తుతం దర్శకుడు వివేక్ ఆత్రేయ(Vivek Athreya)తో సరిపోదా శనివారం(Saripoda Sanivaram) అనే సినిమా చేస్తున్నాడు. ప్రియాంక మోహనన్(Priyanka Mohanan) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య(DVV Danayya) నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 24 నాని పుట్టిన రోజు సందర్బంగా ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోకి ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. 

అదే ఊపులో మరో సినిమాను మొదలుపెట్టేశాడు నాని. పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా చేస్తున్న దర్శకుడు సుజీత్(Sujeeth) తో తన 32వ సినిమాను మొదలుపెట్టేశాడు. గ్యాంగ్ స్టర్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా సంబందించిన అనౌన్స్మెంట్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియో సినిమాపై అంచనాలను పెంచుతోంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఓజీ తరువాత సుజీత్ తో నాని సినిమా చేయడంపై ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. త్వరలోనే షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందు రానుంది. 

ఈ రెండు సినిమాలే కాకుండా బలగం వేణుతో మరో సినిమా చేయనున్నాడు నాని. ఈ వార్త కూడా కొంత కాలంగా ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఈ సినిమా అప్డేట్ కూడా వస్తుందని నాని ఫ్యాన్స్ అనుకున్నారు కానీ రాలేదు. బలగం లాగే ఈ ప్రాజెక్టు కూడా  పక్కా విలేజ్ బ్యాక్డ్రాప్ లో వస్తుందని టాక్. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించనున్నాడట.