రాష్ట్రపతి చేతుల మీదుగా ప్లే బ్యాక్ సింగర్ అవార్డు

రాష్ట్రపతి చేతుల మీదుగా ప్లే బ్యాక్ సింగర్ అవార్డు

68వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం చారిత్రాత్మ ఘట్టానికి వేదికైంది. జాతీయ ఉత్తమ నేపథ్య గాయనిగా ఎంపికైన గిరిజన మహిళ నంజియమ్మకు..ఆదివాసీ తెగలో జన్మించి...భారత రాష్ట్రపతి అయిన  ద్రౌపది ముర్ము అవార్డును అందజేశారు. 68వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో నంజియమ్మ వినపడగానే...కరతాళ ధ్వనుల ప్రాంగణం మోరుమోగింది. నవ్వుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు వచ్చిన నంజియమ్మ..ఆమె చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ సమయంలో ప్రేక్షకులు లేచి నిలబడి శుభాకాంక్షలు తెలిపారు. 

ప్రతిభా శక్తి..
నంజియమ్మ ఉత్తమ నేపథ్య గాయని అవార్డు గెలుచుకోవడం పట్ల కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సంతోషం వ్యక్తం చేశారు.  కేరళలోని చిన్న గిరిజన సమాజానికి చెందిన ఒక జానపద గాయని అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఎలాంటి సినిమా నేపథ్యం గానీ లేని నంజియమ్మకు అవార్డు రావడం గొప్పగా ఉందన్నారు. 

ఆశా పరేఖ్ ఫిదా..
నంజియమ్మ పాటకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఆశా పరేఖ్ ఫిదా అయ్యారు. ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ అవార్డు అందుకున్న  నంజియమ్మ..  ఆశా పరేఖ్, కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, ఎల్ మురుగన్ ముందు పాడారు.  వారంతా నంజియమ్మను అభినందించారు.

 

కలకాత్తా పాటకు అవార్డు..
2020లో మలయాళంలో వచ్చిన అయ్యప్పనుమ్​ కోషియుమ్​​ సినిమా సూపర్​హిట్​అయింది. ఈ సినిమాలో నంజియమ్మ స్వయంగా ఓ పాట రాసి పాడారు.  'కలకాత్తా అనే పాటకు  జాతీయ అవార్డు దక్కింది.  ప్లే బ్యాక్​ సింగింగ్​లో జాతీయ అవార్డు అందుకున్న తొలి గిరిజన మహిళగా నంజియమ్మ చరిత్రకెక్కింది. 

15 ఏళ్లకే పెళ్లి..
నంజియమ్మది కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్‌ జిల్లా అట్టప్పడి దగ్గర నుక్కుపథి పిరివు అనే గిరిజన గ్రామం. ఆమెకు 15ఏళ్లకే  పెళ్లయింది. నంజియమ్మ గిరిజన భాషలో మాట్లాడడం, పాడడం నేర్చుకుంది.  ఆమెకు  కొడుకు,  కూతురు ఉన్నారు.  కొడుకు అగలిలోని ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. దశాబ్దాలుగా నంజియమ్మ కుటుంబం వ్యవసాయం, పశువులను మేపుతూనే జీవనం కొనసాగిస్తోంది. ఈ సమయంలోనే పాటల్ని సృష్టించుకుని..పాడుతుండేది. చెట్టు, గట్టు, పుట్ట, పశువులను చూస్తూనే అలవోకగా పాటు పాడేది. గిరిజన కళాకారుల సంఘం ఆట కళాసంఘం, ఆజాద్‌ కళా సమితిలో ఆమె సభ్యురాలు. పళని స్వామి ఆజాద్‌ కళా సమితి వ్యవస్థాపకుడు. ఈయన ద్వారానే నంజియమ్మ గురించి గురించి తెలుసుకున్న అయ్యప్పనుమ్​ కోషియుమ్​​ దర్శకుడు సాచీ..ఆమెకు ఒక అవకాశం ఇచ్చాడు. 2020లో విడుదలై ఈ మూవీ మాలీవుడ్​లో మంచి విజయాన్ని అందుకుంది.