ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలవడంపై ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. "ఎమ్మెల్సీగా విజయం సాధించిన విజయవాడ మాజీ మేయర్, చేనేత ఆడపడుచు, మా తెలుగుదేశం కుటుంబసభ్యురాలు పంచుమర్తి అనురాధకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మేము 23 సీట్లే గెలిచామని ఎద్దేవా చేశావు. అందులో నలుగురిని సంతలో పశువుల్లా కొన్నావు .. చివరికి అదే 23వ తేదీన, అదే 23 ఓట్లతో నీ ఓటమి-... మా గెలుపు. ఇది కదా దేవుడు స్క్రిప్ట్ అంటే జగన్ " అని లోకేష్ ట్వీట్ చేశారు.
https://twitter.com/naralokesh/status/1638898358449508355?cxt=HHwWhsDU5fXXxL4tAAAA
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అయిన పంచుమర్తి అనురాధ గెలుపొందారు. 23 ఓట్లతో ఆమె గెలుపొందారు. 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికి 23 ఓట్లతో అనుహ్యంగా గెలిచారు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది. అటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అనుహ్యంగా 3 స్థానాల్లో విజయం సాధించింది. ఈ విజయం మరిచికపోకముందే టీడీపీ సత్తా చాటింది. మరోవైపు టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. మెజార్టీకి అవసరమైన ఎమ్మెల్యేలు లేకపోయినా పార్టీ గెలవడంపై ఖుషి అవుతున్నారు