మోసానికి మాన‌వ‌రూపం జ‌గ‌న్ : నారా లోకేష్

 మోసానికి మాన‌వ‌రూపం జ‌గ‌న్ :  నారా లోకేష్

ఏపీని స‌ర్వనాశ‌నం చేసిన జగన్  పని అయిపోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్ అన్నారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. యువ‌గ‌ళం పాద‌యాత్రలో భాగంగా చిత్తూరు నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వహించిన బ‌హిరంగ‌స‌భ‌లో  లోకేష్ పాల్గొన్నారు.  జగన్ కు అసలైన భయాన్ని పరిచయం చేసే బాధ్యత తనదేనన్నారు. మోసానికి మాన‌వ‌రూపం జ‌గ‌న్ అని విమర్శించారు. జ‌గ‌న్ పాల‌న‌లో ఏపీ లాండ్, శాండ్, వైన్, మైన్ దోపిడీలో నెంబ‌ర్ వ‌న్  అయ్యిందని ఆరోపించారు.  రాష్ట్రాన్ని జగన్ అప్పుల్లో నెంబ‌ర్ వ‌న్ చేశారని లోకేష్  విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా తాగునీటి ప‌థ‌కం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా కేంద్రంగా ఎల‌క్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేసి నిరుద్యోగ స‌మ‌స్య ప‌రిష్కరిస్తామని చెప్పారు. చిత్తూరు యూనివ‌ర్సిటీ క‌లని చంద్రబాబు నెర‌వేరుస్తాని లోకేష్ తెలిపారు. లోకేష్‌ని అడ్డుకుంటే యువ‌గ‌ళం ఆగ‌దని హెచ్చరించారు.