ఒక టికెట్ కొంటే ఇద్దరు సినిమా చూడొచ్చు..నరకాసుర మేకర్స్ బంపర్ ఆఫర్

ఒక టికెట్ కొంటే ఇద్దరు సినిమా చూడొచ్చు..నరకాసుర మేకర్స్ బంపర్ ఆఫర్

పలాస మూవీతో మంచి హిట్ అందుకుని..తెలుగు ఆడియాన్స్ కు చేరువైన హీరో రక్షిత్ (Rakshith) అట్లూరి లేటెస్ట్ మూవీ నరకాసుర (Narakasura). పలాస తరహాలోనే రా అండ్ రస్టిక్ సినిమాతో రక్షిత్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సోషల్ మెసేజ్ తో వచ్చిన ఈ మూవీ..నవంబర్3న థియేటర్లలో రిలీజ్ అయ్యి..మిక్సెడ్ టాక్ తో రన్ అవుతుంది. 

ఈ మేరకు నరకాసుర చిత్ర బృందం ఓ క్రేజీ ఆఫర్‌ని ప్రకటించింది. ఆడియెన్స్ ని థియేటర్‌కి రప్పించే ప్రయత్నంగా..ఒక బంపర్‌ ఆఫర్‌ని ప్రకటించింది.ఈ మూవీ సక్సెస్‌ మీట్‌లో హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ..నరకాసుర మూవీకి ఆడియన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో నా నటనకు.. ట్రాన్స్ జెండర్స్ మధ్య సాగే సన్నివేశాలకు ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతున్నారు.

 ఈ మూవీతో నటుడిగా మరో మెట్టు ఎక్కాడనే ప్రశంసలు రావడం చాలా హ్యాపీగా అనిపిస్తోంది. అయితే..నరకాసుర మూవీలో ఉన్నమంచి మెసేజ్ ను మరింత మందికి రీచ్ అవ్వాలని..సోమవారం (నవంబర్ 6) నుంచి గురువారం (నవంబర్ 9) వరకు..ఒక టికెట్ మీద ఇద్దరు ప్రేక్షకులు..సినిమా చూసేందుకు అవకాశం కల్పిస్తున్నాం. నరకాసుర వంటి మంచి మెసేజ్ ఉన్న సినిమాను థియేటర్స్ లో చూడండి..ఈ మా ప్రయత్నంలో గెలిపిస్తారని ఆశిస్తున్నా..అని హీరో రక్షిత్ అన్నారు.

 ట్రాన్స్ జెండర్స్ ను చిన్న చూపు చూడకూడదు..మనుషులంతా ఒక్కటే..అనే మెసేజ్ ను డైరెక్టర్ చూపించారు. ప్రస్తుతం ఈ అంశం ప్రేక్షకులకు మరింత రీచ్ అయ్యేలా మేకర్స్ చేసే ప్రయత్నం..ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.