
బాలీవుడ్ నటి కరీనా కపూర్(Kareena Kapoor)పై ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణమూర్తి(Narayana Murty) షాకింగ్ కామెంట్స్ చేశారు. తన పక్క సీటులో కూర్చున్న కరీనా కపూర్ అభిమానులు పలకరించడానికి వస్తే పట్టించుకోలేదన్నారు. ఎవరైనా వ్యక్తులు మనల్ని అభిమానిస్తుంటే తిరిగి ఏ రూపంలోనైనా వారిని ప్రేమించాలని ఆయన అన్నారు.
ఇందుకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూ ఒకటి వైరల్గా మారింది. పక్కనే ఉన్న ఆయన సతీమణి సుధామూర్తి మాత్రం కరీనాకు మద్దతుగా నిలవడం విశేషం. ‘కరీనా మనలాంటి వ్యక్తి కాదు. మనకు 10 వేల మంది ఫ్యాన్స్ ఉంటే.. ఫిలింస్టార్ అయిన తనను ఆరాధించేవారు కోట్లలో ఉంటారు.
వారందరినీ పలకరించడం అన్నిసార్లు సాధ్యం కాదు కదా’ అంటూ ఆమె బదులిచ్చారు. దీంతో ఆ కార్యక్రమంలో నవ్వులు విరిసాయి. వీరిద్దరి సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.