
హైదరాబాద్, వెలుగు: భారత రెజ్లింగ్ సమాఖ్య నిర్వహించిన నేషనల్ రెజ్లింగ్ చాంపియన్ షిప్–2025లో నారాయణ విద్యార్థులు మూడు బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. ఆయుష్ ఠాకూర్, వైష్ణవి ఠాకూర్ తమ నైపుణ్యంతో జాతీయస్థాయిలో సత్తా చాటారు. ఆయుష్ ఠాకూర్ అండర్–11 విభాగంలో పోటీపడి రెండు బంగారు పతకాలు గెలుచుకున్నారు. వైష్ణవి ఠాకూర్ అండర్–15 విభాగంలో పోటీపడి బంగారు పతకం సాధించారు. ఈ సందర్భంగా నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ పి. సిందూర నారాయణ మాట్లాడారు. వైష్ణవి, ఆయుష్ విజయాలు సహ విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు. నారాయణ నాలుగు దశాబ్దాలుగా పాటిస్తున్న విలువలకు ఈ విజయాలు నిదర్శనమని చెప్పారు. అనంతరం నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ శరణి నారాయణ మాట్లాడుతూ.. ఆయుష్ ఠాకూర్, వైష్ణవి ఠాకూర్ లకు అభినందనలు తెలిపారు. వారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలన్నారు.