మరికల్, వెలుగు : అడపాదడపా వానలు కురుస్తున్నాయి.. పొలాలను చదును చేసుకోవడానికి రైతులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ట్రాక్టర్లతో పొలాలను దున్నించేందుకు డీజిల్ కోసం మంగళవారం నారాయణపేట జిల్లా మరికల్‌లోని బంకుల వద్ద రైతులు పెద్ద సంఖ్యలో క్యాన్లతో బారులు తీరుతున్నారు. ఒక్కో రైతుకు రూ.2 వేల డీజిల్మాత్రమే పోస్తుండటంతో అది సరిపోవడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరిపోను డీజిల్‌ను అందుబాటులో ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
