పబ్​లపై నార్కోటిక్స్​ బ్యూరో నిఘా

పబ్​లపై నార్కోటిక్స్​ బ్యూరో నిఘా

మాదాపూర్, వెలుగు: టీజీ యాంటీ నార్కోటిక్​బ్యూరో​ పబ్​లపై నిఘాపెట్టి16 మంది గుర్తించి డ్రగ్స్​టెస్టులు చేసింది. ఇందులో ఇద్దరికి పాజిటివ్​రాగా.. వారిని మాదాపూర్​పోలీసులకు అప్పగించింది.  టీజీ యాంటీ నార్కోటిక్స్​బ్యూరో, మాదాపూర్​పోలీసులు తెలిపిన ప్రకారం.. డ్రగ్స్, గంజాయి తీసుకునే వారిపై కొద్ది రోజులుగా నిఘా పెట్టారు. మాదాపూర్​, గచ్చిబౌలి ఏరియాల్లోని పబ్ ల్లో డ్రగ్స్​తీసుకుంటున్నారనే పక్కా సమాచారంతో 16 మందిని టీఎన్​యాంటీ నార్కోటిక్​బ్యూరో అధికారులు, సైబరాబాద్​ ఎస్​ఓటీ పోలీసుల సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నారు. వీరికి 12 ప్యానెల్​అబాట్​యూరిన్​టెస్టింగ్​కిట్​తో టెస్టులు చేశారు. 

జూబ్లీహిల్స్​కు చెందిన ఫేమస్​ డీజే ప్లేయర్​ సిద్ధార్థ్, మాదాపూర్​గఫూర్​నగర్​కు చెందిన స్వరూప్​కొకైన్, గంజాయి తీసుకుంటున్నట్లు నిర్ధారణ అయింది. ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు. డ్రగ్స్​సప్లై చేసే వారికి దూరంగా ఉండాలని టీజీ యాంటీ నార్కోటిక్​ బ్యూరో అధికారులు సూచించారు. స్కూల్స్​, కాలేజీల్లో ఎవరైనా డ్రగ్స్​తీసుకున్నట్లు అనుమానం వస్తే యాంటీ డ్రగ్స్ కమిటీలు స్థానిక పోలీసులకు లేదా టీజీ యాంటీ నార్కోటిక్​ బ్యూరో అధికారులకు తెలిపాలని పేర్కొన్నారు.