
మాదాపూర్ డ్రగ్స్ కేసులో కీలక పరిణాణం చోటు చేసుకుంది. టాలీవుడ్ హీరో నవదీప్ కు నార్కోటిక్ బ్యూరో పోలీసులు నోటీసులు ఇచ్చారు. 41ఏ కింద నోటీసులు ఇచ్చిన పోలీసులు.. 2023 సెప్టెంబర్ 23న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. హెచ్ న్యూ ఆఫీస్ లో విచారకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో A-29 గా నవదీప్ ను చేర్చారు పోలీసులు. నవదీప్ తన ఫ్రెండ్ రామ్ చంద్ తో కలిసి డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు రామ్‌చంద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. కాగా నవదీప్ కు 41 A కింద నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
మాదాపూర్‌లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న ఫ్లాట్‌లో 2023 ఆగస్టు 31న జరిగిన డ్రగ్ పార్టీ తీగ లాగిన టీఎస్ నాబ్ అధికారులు మరో ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిలో నైజీరియన్లతో పాటు టాలీవుడ్‌కు చెందిన వాళ్లు ఉన్నారు. ఈ కేసులో పట్టుబడిన రామ్‌చంద్ విచారణలోనే నటుడు నవదీప్ పేరు వెలుగులోకి వచ్చింది. రామ్‌చంద్ తన వాంగ్మూలంలో నవదీప్ సైతం తనతో కలిసి మాదకద్రవ్యాలు సేవించినట్లుగా వెల్లడించాడు.