ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతిని కోరాం: మోదీ

 ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని  రాష్ట్రపతిని కోరాం: మోదీ

ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు ప్రధాని మోదీ, ఎన్డీయే నేతలు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. ఎన్డీయే మిత్రపక్షాల తీర్మానాన్ని ఈ సందర్భంగా మోదీ రాష్ట్రపతికి అందించారు. అనంతరం మీడియాతోమాట్లాడిన మోదీ..దేశప్రజల ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తామని చెప్పారు. జూన్ 9న ప్రమాణ స్వీకారం చేస్తామని రాష్ట్రపతికి చెప్పామన్నారు మోదీ.

జూన్ 7న ఉదయం ఎన్డీయే పక్ష నేతగా నరేంద్ర మోడీ మూడోసారి ఎన్నికయ్యారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఏర్పాటు చేసిన ఎన్డీయే పార్లమెంటరీ పక్ష  సమావేశంలో ఎన్డీయే కూటమి ఈ మేరకు ఎన్నుకుంది. ఎన్డీయే పక్ష నేతగా మోడీ పేరును రాజ్ నాథ్ సింగ్  ప్రతిపాదించగా అమిత్ షా, గడ్కరీ, కుమారస్వామి, చంద్రబాబు, నితీశ్ బలపరిచారు. 

దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలుత మోదీ శనివారమే ప్రమాణం చేస్తారని వార్తలు రాగా.. తాజాగా ఆ ప్రోగ్రామ్​ను ఆదివారం సాయంత్రానికి మార్చారు. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌‌‌‌లో ఆయన ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వరుసగా మూడో సారి పీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రెండో నేతగా మోదీ రికార్డు సృష్టించనున్నారు.