
చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ మహాబలిపురం చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆయనకు స్వాగతం పలికారు. తమిళ సంప్రదాయ వస్త్రధారణలో మహాబలిపురం వచ్చిన ప్రధాని.. తెల్ల లుంగీ, తెల్లచొక్కా, కండువాతో దర్శనమిచ్చారు. జిన్ పింగ్ కూడా తెల్లచొక్కాలోనే అక్కడకు వచ్చారు. ఇద్దరు నేతలు కలిసి షోర్ టెంపుల్, పంచరథాలు, ఇతర చారిత్రక కట్టడాలను చూశారు. షోర్ టెంపుల్ దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు . అవి ముగిశాక అక్కడే జిన్ పింగ్ కు విందు ఇవ్వనున్నారు మోడీ జిన్ పింగ్ కు ఇచ్చే విందులో చైనా వంటకాలతో పాటు తమిళ రుచులను కూడా వడ్డించనున్నారు.
భారత్ చైనా మధ్య విబేధాలు ఉన్నా స్నేహబంధం ఉంటే వాటికి పరిష్కారం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ అనధికారిక భేటీలు జరుగుతున్నాయి.