మోడీ రెప్పైనా వాల్చలేదు : రాత్రంతా దాడుల పర్యవేక్షణ

మోడీ రెప్పైనా వాల్చలేదు : రాత్రంతా దాడుల పర్యవేక్షణ

న్యూఢిల్లీ: ప్రత్యక్షంగా బాలాకోట్ పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడులకు పాల్పడితే.. రాత్రంతా కునుకులేకుండా ఆ ఆపరేషన్ ను ప్రధాని నరేంద్ర మోడీ పర్యవేక్షించారు. దాడి పూర్తయ్యి  సైనికులు క్షేమంగా తిరిగొచ్చాకే ఆయన ఊపిరి పీల్చుకున్నారు. తెల్లవారుజామున 4.30 గంటలకు ఆపరేషన్ లో పాల్గొ న్న ఐఏఎఫ్ సిబ్బందికి శుభాకాంక్షలు చెప్పిన ఆయన.. రోజు మొత్తం బిజీబిజీగా గడిపారు. ‘‘ప్రధాని నిద్ర పోలేదు. కనీసం రెప్ప కూడా వాల్చలేదు. ఆపరేషన్ లో ఆయన కూడా భాగమయ్యారు” అని ఓ అధికారి చెప్పారు.

టెర్రరిస్ట్ క్యాంపుపై దాడికి సంబంధించి ప్రిపరేషన్లను అడిగి తెలుసుకున్నారని చెప్పారు. ఆపరేషన్ జరుగుతున్నంత సేపూ రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ , జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ , ఎయిర్ ఫోర్స్ చీఫ్ బీఎస్ ధనోవాతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉన్నారని తెలిపారు. ఆపరేషన్ కాగానే ఆపరేషన్ లో పాల్గొ న్న పైలెట్ల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారని చెప్పారు.  ఆపరేషన్ పూర్తయిన తర్వాత మంగళవారం సాయంత్రం త్రివిధ దళాధిపతులతో మోడీ సమావేశమయ్యారు.