Marokkasari: ఫీల్ గుడ్ లవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టోరీతో ‘మరొక్కసారి’.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్

Marokkasari: ఫీల్ గుడ్ లవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టోరీతో  ‘మరొక్కసారి’.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్

నరేష్ అగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్త్య, సంజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నా జంటగా నితిన్ లింగుట్ల దర్శకత్వంలో  బి చంద్రకాంత్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘మరొక్కసారి’. ఫీల్ గుడ్ లవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ‘ఈ చిత్రాన్ని కేరళ, సిక్కిం, టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో చిత్రీకరించాం. అలాగే 5,430 మీ. ఎత్తులో ఉండే గురుడోంగ్మార్ లేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో షూటింగ్ చేసిన మొట్టమొదటి ఇండియన్ మూవీ ఇది.

►ALSO READ | Telugu Thriller: సస్పెన్స్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా.. సత్యం రాజేష్ కొత్త చిత్రం షురూ

ఆహ్లాదకరమైన ప్రేమ కథగా అందర్నీ అలరిస్తుంది. త్వరలోనే రిలీజ్ డేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అనౌన్స్ చేస్తాం’అని చెప్పారు. బ్రహ్మాజీ, సుదర్శన్, వెంకట్ కాకమాను, దివ్యవాణి ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి  భరత్ మాంచిరాజు  సంగీతం అందిస్తున్నాడు.