‘మా’ అధ్యక్షుడిగా నరేశ్ ప్రమాణం

‘మా’ అధ్యక్షుడిగా నరేశ్ ప్రమాణం

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ‘మా’ అధ్యక్షుడిగా ప్రముఖ నటుడు నరేష్ ఇవాళ ( శుక్రవారం) ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో శివాజీ రాజా ప్యానెల్ పై నరేష్ ప్యానెల్ విజయం సాధించింది. సీనియర్ నటుడు నరేష్ కొత్త అధ్యక్షుడిగా, హీరో రాజశేఖర్ ఉపాధ్యక్షుడిగా, జీవిత ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

కొంతకాలంగా నరేశ్‌కు, ‘మా’ మాజీ అధ్యక్షుడు, శివాజీ రాజాకు అభిప్రాయభేదాలు ఏర్పడ్డాయి. కాగా ఆయన కూడా ఇవాళ ప్రమాణస్వీకారానికిహాజరయ్యారు.ఈ సందర్భంగా శివాజీరాజా మాట్లాడారు. ‘మా’ కమిటీ భవిష్యత్తులో అద్భుతాలు చేయాలని, ఎప్పటిలాగే మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నానని చెప్పారు శివాజీ రాజా. తన నుంచి ఏ సాయం కావాలన్నా నేను చేయడానికి సిద్ధమేనని చెప్పారు. ఈ సందర్భంగా ‘మా’ కోసం ఓ ప్రత్యేక గీతాన్ని కమిటీ రూపొందించగా….. ఈ పాటను సూపర్‌స్టార్‌ కృష్ణ దంపతులు, కృష్ణంరాజు దంపతుల చేతుల మీదుగా విడుదల చేశారు.