మళ్లీ పెళ్లి.. ఇది వాళ్ల కథే.. అందరికీ షాకిచ్చిన పవిత్ర, నరేష్

మళ్లీ పెళ్లి.. ఇది వాళ్ల కథే.. అందరికీ షాకిచ్చిన పవిత్ర, నరేష్

నరేష్, పవిత్ర.. గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో ఈ పేర్లు పెద్ద హాట్ టాపిక్. సోషల్ మీడియాలో వాళ్ల పర్సనల్ లైఫ్ గురించే చర్చ అంత. ఈ ఇద్దరి ప్రేమ వ్యవహారం గురించి వాళ్లు వీళ్లు చెప్పటమే తప్ప నిజాలేమిటో ఎవ్వరికీ తెలియదు. అయితే, కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నరేష్, పవిత్ర కలిసి సినిమా తీస్తు్న్నారని వార్తలు వచ్చాయి. అవి నిజం అని నమ్మేలా న్యూ ఇయర్ రోజు ఒక గ్లిప్స్, తాజాగా పెళ్లి చేసుకున్న వీడియో బయట పెట్టారు. అవి వాళ్లు తీయబోతున్న సినిమాలోని క్లిప్స్ అని కొన్ని రోజుల తర్వాత రివీల్ చేశారు. 

అయితే, శుక్రవారంనాడు (ఏప్రిల్21) పవిత్ర, నరేష్ నటించిన మళ్లీ పెళ్లి టీజర్ ను విడుదల చేశారు. ఈ కథ వాళ్ల నిజ జీవితం ఆధారంగా తెరకెక్కినట్లు నరేష్ వివరించాడు. టీజర్ లో నరేష్ మూడో భార్యతో జరిగిన గొడవలు, పవిత్రతో సహ జీవనం గురించిన స్టోరి ఉంది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. వాళ్ల నిజ జీవితం ఆధారంగా తీసిన స్టోరీ అని చెప్తున్నా.. సినిమాలో మాత్రం పాత్రల పేర్లను మార్చేశారు.

ఈ సినిమాకి అరుల్‌దేవ్, సురేశ్ బొబ్బిలి మ్యూజిక్ అందించారు. జయసుధ, శరత్ బాబు, అనన్య నాగళ్ల ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ సమ్మర్ లోనే మళ్లీ పెళ్లి మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్. తెలుగు, కన్నడ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. నరేష్ ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.