నారీ నారీ నడుమ మురారి పర్ఫెక్ట్ పండగ సినిమా

నారీ నారీ నడుమ మురారి పర్ఫెక్ట్ పండగ సినిమా

‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంలో  పెర్ఫార్మెన్స్‌‌‌‌కి స్కోప్ ఉండే మంచి క్యారెక్టర్ చేశానని చెప్పింది సంయుక్త. శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రంలో మరో హీరోయిన్‌‌‌‌గా సాక్షి వైద్య నటించింది. సంక్రాంతి  కానుకగా జనవరి 14న  ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సంయుక్త చెప్పిన విశేషాలు.‘‘-డైరెక్టర్  కథ చెప్పినప్పుడు చాలా నచ్చింది. వెరీ బ్యూటిఫుల్ స్టోరీ. నాకు కామెడీ సినిమా చేయడం చాలా ఇష్టం. ఇదొక  క్లీన్ కామెడీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్. 

పండుగకి  పర్ఫెక్ట్ మూవీగా ఆడియెన్స్ ముందుకొస్తోంది.  -ఇందులో నా క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నప్పుడు ఆడియెన్స్ సహజంగా ట్రైయాంగిల్ లవ్ స్టోరీ అనుకుంటారు. కానీ ఇది అలా కాదు. ఇదొక యూనిక్ పాయింట్. ఇందులో సిచ్యువేషన్  కామెడీ ఉంటుంది. డబ్బింగ్ చెప్పేటప్పుడు  చాలా ఎంజాయ్ చేశా. శర్వానంద్ టైమింగ్ ఉన్న హీరో. చాలా సపోర్టివ్, హెల్ప్‌‌‌‌ఫుల్‌‌‌‌గా ఉంటారు. ఆయనతో పనిచేయడం గుడ్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్. 

సాక్షి వైద్యతో వచ్చే కాంబినేషన్ సీన్స్ హిలేరియస్‌‌‌‌గా ఉంటాయి. నరేష్ గారు, సత్య గారి పాత్రలు కూడా అందరినీ అలరిస్తాయి.  -డైరెక్టర్ చాలా కూల్‌‌‌‌గా ఉంటారు. ఇంత కాంపిటీషన్‌‌‌‌లో  సినిమా వస్తున్న ఆయనకు ఎలాంటి ఒత్తిడి ఉండదు.  చాలా కాన్ఫిడెంట్‌‌‌‌గా ఉంటారు. నిర్మాత -అనిల్ గారికి సినిమా అంటే చాలా ప్యాషన్. ఆయన కోసం పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా’’.