మధ్యప్రదేశ్ లో భారీ వర్షాలు.. పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్

మధ్యప్రదేశ్ లో  భారీ వర్షాలు.. పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్

మధ్యప్రదేశ్ లో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భోపాల్, ఉజ్జయిని, జబల్ పర్ సహా 39 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇండోర్, గ్వాలియర్, ధార్, ఖర్గోన్ సహా 12 జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయన్నారు వాతావరణ శాఖ అధికారులు.  ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. జబల్ పూర్, బుందేల్ ఖండ్ లో చాలా ఏరియాల్లో నీళ్లు నిలిచిపోయాయి. నరమదాపురం జిల్లాతో పాటు భోపాల్ లో ఇవాళ స్కూళ్లకు సెలువులు ప్రకటించారు. 

మరోవైపు భారీ వర్షాలతో చిన్నా, పెద్ద నదుల్లో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరింది. నర్మదా నదికి వరద పోటెత్తుతోంది. నర్మదాపురంలో తవా డ్యాం గేట్లను, భూపాల్ లో 3 డ్యాంల గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 
 
రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో రాజస్థాన్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని జైపూర్ సహా పలు జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. 10 జిల్లాల్లో అతి భారీ, 10 జిల్లాల్లో భారీ వర్షాలు పడ్తాయని వాతావారణ శాఖ తెలిపింది. 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఝలావర్, ప్రతాప్ గఢ్, బరన్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రెండు రోజులుగా వానలు పడ్తుండడంతో కోట బ్యారేజీ 8 గేట్లను తెరిచి 95 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. రేపు కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు పడ్తాయన్నారు వాతావరణ శాఖ అధికారులు.