
నర్సంపేట , వెలుగు : సద్దుల బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా సోమవారం నుంచి వచ్చే నెల 4 వరకు వరుసగా 6 రోజులు నర్సంపేట వ్యవసాయ మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు చైర్మన్ పాలాయి శ్రీనివాస్ తెలిపారు.
29న సద్దుల బతుకమ్మ, 30న మంగళవారం వారాంతపు సెలవు, 1న మహార్నవమి, 2,3 దసరా వేడుకలు, 4న వ్యాపారుల కోరిక మేరకు మార్కెట్‌కు సెలవు ప్రకటించినట్లు వెల్లడించారు. ఆయా రోజుల్లో రైతులు తమ పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకురావొద్దని సూచించారు.