కాంగ్రెస్ అభ్యర్థులకు పట్టం కట్టండి : ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

కాంగ్రెస్ అభ్యర్థులకు పట్టం కట్టండి :  ఎమ్మెల్యే  దొంతి మాధవరెడ్డి

నర్సంపేట, వెలుగు : పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్​బలపర్చిన అభ్యర్థులకు పట్టం కట్టాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రజలకు పిలపునిచ్చారు. చెన్నారావుపేట మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్​ అభ్యర్థుల తరపున ఎమ్మెల్యే విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్​ పదేండ్ల పాలనలో గ్రామాల్లో ఒక డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మించిన పాపాన పోలేదని విమర్శించారు.

 కాంగ్రెస్​ పాలనలో అర్హులైన ప్రతి పేదవాడికి ఇండ్లు మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందించే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో  పీసీసీ సభ్యుడు  పెండెం రామానంద్, నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలయి శ్రీనివాస్, కాంగ్రెస్ చెన్నారావుపేట మండల అధ్యక్షుడు సిద్దెన రమేశ్, మాజీ ఎంపీపీ కేతిడి వీరారెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మొగిలి వెంకట్ రెడ్డి, చెన్నారావుపేట సొసైటీ మాజీ వైస్ చైర్మన్ చెన్నారెడ్డి, సోషల్ మీడియా కో–ఆర్డినేటర్ మహమ్మద్ ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.