కేసీఆర్ టూర్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం

కేసీఆర్ టూర్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం

వరంగల్  : నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పోలీసులు అడ్డగించారు. బందోబస్తులో భాగంగా హన్మకొండలో సుదర్శన్ వాహనాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ..మనస్థాపం చెందిన ఆయన పాదయాత్ర చేశారు. ఎమ్మెల్యే హెడ్ క్వార్టర్ నుండి కలెక్టర్ భవనం వరకు నడుచుకుంటూ వెళ్లి నిరసన తెలిపారు. తర్వాత పోలీసుల తీరు పట్ల సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.