శివ్వంపేట: భూ సమస్య పరిష్కరించాలి : నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి

శివ్వంపేట: భూ సమస్య పరిష్కరించాలి : నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి

శివ్వంపేట, వెలుగు:  మెదక్​జిల్లా శివ్వంపేట మండలం కొంతాన్​ పల్లిలో నెలకొన్న భూసమస్యను పరిష్కరించాలని నర్సాపూర్​ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కలెక్టర్​ ప్రతిమా సింగ్​ ను కోరారు. సోమవారం గ్రామానికి ఎస్సీలు, గిరిజనులు ఎమ్మెల్యేతో కలిసి ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ భూమిని హైదరాబాద్​కు చెందిన వారికి పట్టా చేసి ఇచ్చారని ఆరోపించారు. ఆ గ్రామంలో ల్యాండ్ చాలా ఎక్సెస్ ఉందని,  వెంటనే సర్వే చేసి అసలైన రైతులకు పంపిణీ చేయాలన్నారు.