- నర్సాపూర్ సెగ్మెంట్ కాంగ్రెస్ఇన్చార్జి రాజిరెడ్డి
శివ్వంపేట, వెలుగు: పేదల సొంతింటి కలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేరుస్తోందని కాంగ్రెస్నర్సాపూర్ సెగ్మెంట్ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు. మండలంలోని గోమారం గ్రామంలో 40 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా అందులో పూర్తయిన నాచారం సుశీల, గురుకంటి చంద్రకళ, చిన్నుల వెంకటమ్మ, మంచోళ్ల రవి కుటుంబాలు సోమవారం రాజిరెడ్డి సమక్షంలో గృహప్రవేశం చేశారు. ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వస్తాయని పదేళ్లు ఎదురుచూసి తీవ్ర నిరాశకు గురయ్యారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సొంత స్థలం ఉండి ఇళ్లు లేని వారికి రూ.5 లక్షలు మంజూరు చేయడంతో సొంత ఇంటి కల నెరవేర్చుకుంటున్నారన్నారు. అనంతరం రాజిరెడ్డి గోమారంలోని పాలిటెక్నిక్ కాలేజీని పరిశీలించారు, విద్యార్థులు, లెక్చరర్లు ఫర్నిచర్ అవసరాలనికి రూ. 40 లక్షలు అవుతాయని చెప్పగా జిల్లా ఇన్చార్జి మంత్రి దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత దొంతి, కొంతాన్ పల్లి, దంతాన్ పల్లిలో మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మాధవరెడ్డి. మాజీ సర్పంచ్ లావణ్య రెడ్డి, కాంగ్రెస్ నాయకులు నవీన్ గుప్తా, సుధీర్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, నరసింహారెడ్డి, శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, రాజు గౌడ్, అరుణ్ కుమార్ పాల్గొన్నారు.
